చలి నుంచి రక్షణకు జూపార్క్ లో ప్రత్యేక ఏర్పాట్లు

Zoo Park
x
Zoo Park
Highlights

గతకొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చలితీవ్రత భారీగా పెరిగింది. ఎప్పుడూ లేనంతగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మనుషులే చలికి తట్టుకోలేకపోతున్నారు. ఇక మూగజీవాల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు.

గతకొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చలితీవ్రత భారీగా పెరిగింది. ఎప్పుడూ లేనంతగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మనుషులే చలికి తట్టుకోలేకపోతున్నారు. ఇక మూగజీవాల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. చలికి వన్యప్రాణులన్నీ అల్లాడుతున్నాయి. దీంతో జూపార్క్ అధికారులు జంతువుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు.

జంతువుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నారు జూ సిబ్బంది. ఒడిస్సాలోని భువనేశ్వర్ లో ఉన్న నందన్‌కనన్ జంతు ప్రదర్శనశాల భారతదేశంలో పేరుపొందిన జూ. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు చలిగాలులు కూడా బాగా వీస్తున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పును తట్టుకోలేక, జంతువులు తీవ్ర ఇబ్బందిపడుతున్నాయి.

జూలో పలు రకాల జాతులకు చెందిన జంతువులు, పక్షులు ఉంటాయి. దీంతో జూపార్క్ సిబ్బంది జంతువులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటుంటారు. అయితే గత వారం రోజుల్లో చలితీవ్రత క్రమంగా పెరగడంతో జంతువుల రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రూమ్ హీటర్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. జంతువుల్ని ఉంచే బోన్లలో హీటర్లను ఉంచుతున్నారు. రూం హీటర్లను ఏర్పాటు చేయడం వల్ల ఉష్ణోగ్రత పెరిగి చలి నుంచి మూగజీవాలకు కొంతవరకు ఉపశమనం లభిస్తోంది.

చలికి మూగజీవాలు ఇబ్బందులు పడకుండా అన్నివిధాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు పక్షుల కూడా చలిగాలులకు గురికాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పక్షుల వద్ద జూట్ సంచులను ఏర్పాటు చేసి చల్లదనం నుంచి కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. పక్షుల్ని ఉంచిన చోట చలిగాలులు తాకకుండా పరదాలు కప్పుతున్నారు. ఆ ప్రాంతమంతా వెచ్చగా ఉండేలా దాని చుట్టూ కవర్లు కప్పుతున్నారు. జంతువులు చలిఒత్తిడిని తట్టుకునేలా విటిమిన్ బీ కాంప్లెక్స్ కూడా జూ అధికారులు అందిస్తున్నారు.





































Show Full Article
Print Article
Next Story
More Stories