Top
logo

కాంగ్రెస్‌కు మరో ఝలక్.. కారెక్కనున్న కీలక నేత

కాంగ్రెస్‌కు మరో ఝలక్.. కారెక్కనున్న కీలక నేత
X
Highlights

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి వరుస పెట్టి షాక్స్ ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు. ఎన్నికల సమీపిస్తున్న ...

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి వరుస పెట్టి షాక్స్ ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకోగా తాజాగా మరో నేత గూలాబీ గూటికి చేరనున్నట్లె తెలుస్తోంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత అనిల్ జాదవ్ గూలాబీ గూటీకి చేరనున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ జెండా కప్పుకోనున్నట్లు సమాచారం. కాగా కారెక్కేందుకు ఎల్లుండి అంటే 20వ తేదిన ముహూర్తం ఖారారైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్యనేతల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గూటీకి చేరనున్నారు. అనిల్ జాదవ్ బోథ్ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ప‌నిచేశారు.

Next Story