ఏపీ టీడీపీ, కాంగ్రెస్ దోస్తానాపై తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్

ఏపీ టీడీపీ, కాంగ్రెస్ దోస్తానాపై తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్
x
Highlights

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండదని తేలిపోయింది. అసెంబ్లీ , పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం నిర్ణయించింది.

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండదని తేలిపోయింది. అసెంబ్లీ , పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం నిర్ణయించింది. అయితే రాహుల్‌ను ప్రధానిని చేయాలన్న లక్ష్యంతో జాతీయ స్థాయిలో మాత్రం టీడీపీతో అవగాహన కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది.

టీడీపీ, కాంగ్రెస్ దోస్తానాకు తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్...తెలంగాణలో పొత్తు ప్రయోగం విఫలంతో పొత్తుకు బ్రేక్...ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పొత్తుపై క్లారిటీ వచ్చేసింది. రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు. 175 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఊమెన్ చాందీ తెలిపారు. టీడీపీతో అవగాహన జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితమని తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఫిబ్రవరిలో ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతున్నట్లు ఊమెన్ చాందీ చెప్పారు.

మంగళవారం ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు కాంగ్రెస్ అధినేత రాహుల్‌తో అరగంట పాటు భేటీ అయ్యారు. ఏపీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అంశంపై ఇద్దరు నేతలు మంతనాలు జరిపారు. అయితే తెలంగాణలో పొత్తు ప్రయోగం విఫలమవ్వడం, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఇంకా ఆగ్రహం తగ్గకపోవడంతో పాటు కాంగ్రెస్‌‌తో కలసి పోటీ చేయడంపై టీడీపీ నేతల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో పొత్తు ఆలోచన విరమించుకున్నారు. రాహుల్, చంద్రబాబు భేటీ మరుసటి రోజే పొత్తు గురించి ఏఐసీసీ స్పష్టత ఇచ్చింది.

ఏపీలో కాంగ్రెస్‌ సొంతంగానే పోటీ చేస్తుందంటూ ఏఐసీసీ స్పష్టత ఇచ్చినట్లు ఏపీసీసీ చీఫ్ రఘువీరా చెప్పారు. ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలని అన్నారు. అటు ప్రత్యేక హోదా సాధనా సమితి ఫిబ్రవరి 1న చేస్తున్న బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు రఘువీరా రెడ్డి ప్రకటించారు. ఏపీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సై అంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ నెల 31 సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోబోతోంది. ఎన్నికల కమిటీలతో పాటు ఇతర అంశాలపై దృష్టిసారించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories