ఏపీలో నూతన హైకోర్టు

ఏపీలో నూతన హైకోర్టు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మంగళవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉన్న తరుణంలో ఉమ్మడి హైకోర్టు నుంచి న్యాయమూర్తులు, ఇతర సిబ్బంది అమరావతికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వారికి విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌ దగ్గర ఘన స్వాగతం లభించింది. ఉదయం 10 గంటలా 30 నిముషాలకు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మంగళవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉన్న తరుణంలో ఉమ్మడి హైకోర్టు నుంచి న్యాయమూర్తులు, ఇతర సిబ్బంది అమరావతికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వారికి విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌ దగ్గర ఘన స్వాగతం లభించింది. ఉదయం 10 గంటలా 30 నిముషాలకు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టు దగ్గర వీడ్కోలు తీసుకుని విజయవాడ చేరుకున్న న్యాయమూర్తులకు నోవాటెల్‌ హోటల్‌ దగ్గర ఏపీ బార్‌ అసోసియేషన్‌ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉన్నతాధికారులు వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

మంగళవారం ఉదయం 10 గంటలా 30 నిముషాలకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌.. ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇతర న్యాయమూర్తులు కూడా అదే సమయంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. న్యాయమూర్తులకు ప్రభుత్వం నోవాటెల్‌ హోటల్‌లో తాత్కాలిక బస ఏర్పాటు చేసింది. ప్రమాణస్వీకారం కోసం ఇందిరాగాంధీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు హైకోర్టు కార్యకలాపాల కోసం ఎంజీ రోడ్డులోని ఏపీ ఏటీ భవనంలోని 10 వేల చదరపు అడుగులు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే కొత్త హైకోర్టుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ రాయలసీమకు చెందిన న్యాయవాదులు ఆందోళన చేపట్టింది. శ్రీ బాగ్‌ ఒడంబడికకు ఏపీ సర్కారు తూట్లు పొడించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి ఒకటిన తాము బ్లాక్‌ డే గా జరుపుకుంటామని హెచ్చరించారు. మొత్తానికి హైకోర్టు కార్యకలాపాల్లో చరిత్రాత్మకమైన సమయం అత్యంత ఉద్వేగభరింతంగా అంతకుమించిన ఆసక్తికరంగా కనిపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories