రేపటి నుంచి ఏపీ ఎంసెట్‌

రేపటి నుంచి ఏపీ ఎంసెట్‌
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంసెట్ పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి. రెండేళ్లుగా ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ ఆధారిత) ద్వారా ఎంసెట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంసెట్ పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి. రెండేళ్లుగా ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ ఆధారిత) ద్వారా ఎంసెట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 20, 21, 22 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహణ. 23, 24వ తేదీల్లో అగ్రికల్చర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అదేవిధంగా మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎంసెట్ ఛైర్మన్ రామలింగరాజు వెల్లడించారు. మొత్తం 2,82,633 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,723 మంది.. వ్యవసాయం, వైద్య విభాగంలో 86,910 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా మొత్తం 23,051మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories