Top
logo

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అమృత

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అమృత
Highlights

అమృత తల్లి అయ్యింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె మగబిడ్డకు జన్ననిచ్చింది. తమ వివాహం అయిన రోజునే...

అమృత తల్లి అయ్యింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె మగబిడ్డకు జన్ననిచ్చింది. తమ వివాహం అయిన రోజునే మగబిడ్డ జన్మించడంతో ప్రణయ్‌ మళ్లీ పుట్టారంటూ.. కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకుంటున్నారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నట్లు.. వైద్యులు తెలిపారు.

గతేడాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రి ప్రాంగణంలో ప్రణయ్‌ను హత్య చేసిన ఉదంతం కలకలం రేపింది. అమృత తండ్రే కిరాయి హంతకులతో కూతురు భర్త ప్రణయ్‌ను చంపించడంపై తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. తీవ్ర చర్చకు దారి తీసిన ఈ ఉదంతం సమయంలో గర్భవతిగా ఉన్న అమృత ఇవాళ మగబిడ్డకు జన్మనిచ్చింది. మరోవైపు ఇవాళే అమృత, ప్రణయ్‌ వివాహమైన రోజు కావడంతో తమ కుటుంబంలో ప్రణయ్‌ మళ్లీ జన్మించినట్లు భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Next Story


లైవ్ టీవి