విషాదం నిండిన కుటుంబంలో మళ్లీ ఆనందం

విషాదం నిండిన కుటుంబంలో మళ్లీ ఆనందం
x
Highlights

గతేడాది మిర్యాలగూడలో కుల దురహంకారానికి బలైన ప్రణయ్‌ మళ్లీ పుట్టాడు. పెళ్లి రోజే పండంటి మగబిడ్డకు అమృత జన్మనిచ్చింది. తమ పెళ్లి రోజున మగబిడ్డ పుట్టడంతో...

గతేడాది మిర్యాలగూడలో కుల దురహంకారానికి బలైన ప్రణయ్‌ మళ్లీ పుట్టాడు. పెళ్లి రోజే పండంటి మగబిడ్డకు అమృత జన్మనిచ్చింది. తమ పెళ్లి రోజున మగబిడ్డ పుట్టడంతో ప్రణయే మళ్లీ పుట్టాడని అమృత మురిసిపోతోంది. ప్రణయ్ కుటుంబ సభ్యులు కూడా ప్రణయే మళ్లీ పుట్టాడంటూ భావోద్వేగానికి గురవుతున్నారు.

పరువు కత్తికి బలైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అమృత మగబిడ్డకు జన్మనిచ్చినట్టు ప్రణయ్‌ కుటుంబసభ్యులు తెలిపారు. తల్లీబిడ్డలిద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రణయ్‌-అమృత ప్రేమ వివాహం చేసుకొని ఏడాది పూర్తి కావడం సరిగ్గా పెళ్లి రోజునే అమృత పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో ప్రణయే మళ్లీ పుట్టాడని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

పెళ్లి రోజును గుర్తుచేసుకుంటూ 'జస్టిస్ ఫర్ ప్రణయ్' పేజీలో అమృత భావోద్వేగ పోస్టు పెట్టింది. ప్రణయ్ పక్కన లేకుండానే పెళ్లి రోజు గడిచిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గతేడాది ఇదే సమయానికి నేను నీ చెయ్యి పట్టుకొని నడిచేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా ఇప్పుడు మన బిడ్డను నా చేతుల్లోకి తీసుకున్నా అంటూ అమృత పోస్టు పెట్టింది. అమృత పెట్టిన పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. ధైర్యంగా ఉండాలంటూ అమృతకు మెసేజ్‌ల ద్వారా తెలియజేస్తున్నారు. ఆమెకు అండగా సందేశాలు పెడుతున్నారు.

గతేడాది సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో పట్టపగలు ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రణయ్ హత్యకు గురయ్యే నాటికి అమృత 5 నెలల గర్భిణి. అమృతను హెల్త్‌ చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగొస్తుండగా హాస్పిటల్‌ ఆవరణలోనే కిరాయి హంతకుడు ప్రణయ్‌‌ను కత్తితో దారుణంగా నరికి చంపారు. కులాంతర వివాహం చేసుకుందని అమృత తండ్రి మారుతీరావు... ఈ దారుణానికి పాల్పడ్డాడు.

ప్రణయ్ హత్యకు గురయ్యేనాటికి ఐదు నెలల గర్భిణీగా ఉన్న అమృత‌కు అబార్షన్‌ చేయించేందుకు ఆమె తండ్రి మారుతీరావు విశ్వప్రయత్నాలు చేశాడు. దాంతో ప్రణయ్‌‌ను చంపినవాళ్లు తన బిడ్డను కూడా చంపుతారేమోనని ఆనాడు అమృత ఆందోళన వ్యక్తంచేసింది. తన కడుపులో ప్రణయ్ ప్రతిరూపం పెరుగుతోందని, ఆ బిడ్డకు జన్మనిచ్చి ఆ చిన్నారిలో ప్రణయ్‌ని చూసుకుంటానన్న అమృత పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories