టార్గెట్ తెలంగాణ... అమిత్ షా టూర్ బీజేపీకి ఉత్సాహాన్నిచ్చేనా ?

టార్గెట్ తెలంగాణ... అమిత్ షా టూర్ బీజేపీకి ఉత్సాహాన్నిచ్చేనా ?
x
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టిసారించింది. దీనిలో భాగంగా బిజెపి జాతీయ అమిత్‌షా ఇవాళ నిజామాబాద్‌లో...

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టిసారించింది. దీనిలో భాగంగా బిజెపి జాతీయ అమిత్‌షా ఇవాళ నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఐదు పార్లమెంట్ క్లస్టర్ సమావేశంలో అమిత్‌షా పాల్గోనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావంను నిజామాబాద్ నుంచి ప్రారంభించనున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈవాళ నిజామాబాద్‌లో జరిగే క్లస్టర్‌ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని బీజేపీ కీలక నాయకులు పాల్గొంటారు. ఈ సమావేశానికి ముందు హైదరాబాద్‌లో బీజీపీకి చెందిన ముఖ్య నేతలతో అమిత్‌షా సమావేశం కానున్నారు.

ఉదయం 12గంటలకు అమిత్ షా ప్రత్యేక హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకుంటారు..రెండు గంటల పాటు సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించ నున్నారు. మద్యాహ్నం మూడు గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు. భూమారెడ్డి కన్వెషన్ హాల్‌లో జరగనున్న ఈ సమావేశంకు బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్ అమిత్‌షా పర్యటనకు సంబందించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్,ఆదిలాబాద్,కరీంనగర్,జహీరాబాద్,మెదక్ ఐదు పార్లమెంట్ సెగ్మెంట్‌లను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. ఈ 5 పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో వున్న జిల్లా అద్యక్షులు,నియోజకవర్గ ఇంచార్జులు,బూత్ లెవల్ ఇంచార్జులు ఈ సమావేశానికి హజరుకానున్నారు.

ఐదు పార్లమెంట్ సెగ్మెంట్ల క్లస్టర్లల సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొని.. కార్యకర్తలను ఎన్నికల‌కు సిద్ధం చేస్తారని బీజేపీ సీనియర్ నేత ధర్మపురి అరవింద్ చెప్పారు. బీజేపీకి పట్టువున్ననిజామాబాద్,సికింద్రాబాద్, ఆదిలాబాద్ తో పాటు మరికోన్ని పార్లమెంట్ స్థానాలపై బీజేపీ కన్నేసింది. దీనిలో బాగంగానే వాటిపైనే ఎక్కువగా దృష్టిసారిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు,లోకసభ ఎన్నికలు రెండు వేర్వేరు వుంటాయని ఖచ్చితంగా లోకసభ ఏన్నికల్లో మోడీ ప్రభంజనంతో తెలంగాణలో కూడ బిజెపి ఎక్కువ సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు బిజెపి నేతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories