నేటి నుంచి ఏపీలో బీజేపీ బస్సుయాత్ర..

నేటి నుంచి ఏపీలో బీజేపీ బస్సుయాత్ర..
x
Highlights

ఏపీలో పార్టీ బలోపేతం కోసం అష్టకష్టాలు పడుతోన్న బీజేపీ నేట్నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షుడు...

ఏపీలో పార్టీ బలోపేతం కోసం అష్టకష్టాలు పడుతోన్న బీజేపీ నేట్నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ యాత్రను చేపడుతున్నారు. 132 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగనున్న ఈ బస్సు యాత్రను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రారంభించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలోపేతం కోసం బీజేపీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టనున్న బస్సు యాత్ర మొత్తం 15రోజులపాటు జరగనుంది. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి మొదలుకానున్న బస్సు యాత్రను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రారంభించనున్నారు. మొత్తం 132 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర సాగనుంది. ఈ బస్సు యాత్రలో ముఖ్యంగా మోడీ సర్కార్‌ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిధులను, మేళ్లను ప్రజలకు వివరించనున్నారు. ఇక ఫిబ్రవరి 10న ప్రధాని మోడీ ఏపీకి వస్తుండటంతో గుంటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు రాష్ట్ర బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 16న విశాఖలో మోడీ టూర్ ఉండటంతో ఆరోజు కూడా సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 21న రాజమండ్రిలో, ఫిబ్రవరి 26న ఒంగోలులో అమిత్‌ షా పర్యటిస్తారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ‎ఏపీలో బస్సు యాత్ర ఏమేరకు లాభం చేస్తుందన్నది ప్రశ్నార్ధకమే.

Show Full Article
Print Article
Next Story
More Stories