రూ.2 వేల నోటుతో నీచంగా రాజకీయాలు

రూ.2 వేల నోటుతో నీచంగా రాజకీయాలు
x
Highlights

ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ప్రధాని మోడీ...

ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ప్రధాని మోడీ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారని మండి పడ్డారు. సీబీఐ,ఐటీ,ఆర్బీఐ వంటి సంస్థలను నిర్వీర్యం చేసి దేశాన్ని భష్టుపట్టించారన్నారు. పెద్ద నోట్ల రద్దు చేసి రూ.2వేలు నోటు తెచ్చారని, దీంతో రాజకీయాలు నీచంగా మారాయన్నారు. నోట్లరద్దు, 2 వేల రూపాయల నోట్ల వల్ల ఎవరికి మేలు జరిగిందో ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థను నిరుగార్చారని 25 లక్షల ఓట్లను తొలగించారని ఆరోపించారు. సుప్రీం కోర్టుకు తప్పుడు అఫిడవిట్ లు సమర్పించి గ్రామర్ మిస్టేక్ అని చెప్పే పరిస్థితికి కేంద్రం వచ్చిందన్నారు చంద్రబాబు. ప్రధానిగా ఉండేందుకు ఎన్ని తప్పులైనా చేస్తామనే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశ పౌరులు ఆలోచించాల్సిన సమయం ఇది అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories