ఆలోక్‌ వర్మ సంచలన నిర్ణయం ..

ఆలోక్‌ వర్మ సంచలన నిర్ణయం ..
x
Highlights

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు. అంతేకాకుండా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు.

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు. అంతేకాకుండా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. గురువారం సాయంత్రం అలోక్‌ వర్మను సీబీఐ డైరెక్టర్‌ గా తప్పిస్తూ సెలక్ట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. అంతకు ఒకరోజు ముందే సుప్రీం తీర్పుతో సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న ఆయన్ని 24 గంటల్లోనే ఆయన్ని విధుల నుంచి తప్పించారు. దీంతో సీబీఐలో పరిణామాలు వేడెక్కాయి.

అయితే సీబీఐ చీఫ్‌గా అలోక్‌వర్మను తప్పించిన ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, జస్టిస్‌ సిక్రీ సభ్యులుగా ఉన్న సెలక్ట్‌ కమిటీ ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా బదిలీ చేశారు. అయితే అలోక్‌ వర్మ కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ నెల 31 తో ఆయన పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆయన సర్వీసు నుంచి కూడా తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఆయన ఢిల్లీ నార్త్‌ బ్లాక్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెక్రటరీకి లేఖ కూడా పంపారు.

ఇదిలా ఉంటే సెలవులో ఉన్న సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. అవినీతి ఆరోపణల కేసులో తనపై జరుగుతున్న విచారణను నిలిపేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటీషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ స్థితిలో విచారణ నిలిపేయడం కుదరదని స్పష్టం చేసింది. మరోవైపు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం నాగేశ్వర్రావ్‌ నిన్న అలోక్‌ వర్మ చేసిన బదిలీలను రద్దు చేశారు. ఐదుగురు సీబీఐ అధికారులను అలోక్‌వర్మ బదిలీ చేయగా గతంలో ఉన్న వారినే ఆయా స్థానాల్లో కొనసాగించాల్సిందిగా నాగేశ్వర్రావ్‌ ఆదేశాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories