గ్రహణం ముగియడంతో తెరుచుకున్న ఆలయాలు ..

గ్రహణం ముగియడంతో తెరుచుకున్న ఆలయాలు ..
x
Highlights

పాక్షిక చంద్ర గ్రహణంతో మూతపడిన ఆలయాలు మళ్లీ తెరుచుకున్నాయి.. అర్థరాత్రి 1.31 నిమిషాలకు మొదలైన గ్రహణం 4.30 వరకు కనిపించింది.. చంద్రగ్రహణం సందర్భంగా...

పాక్షిక చంద్ర గ్రహణంతో మూతపడిన ఆలయాలు మళ్లీ తెరుచుకున్నాయి.. అర్థరాత్రి 1.31 నిమిషాలకు మొదలైన గ్రహణం 4.30 వరకు కనిపించింది.. చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి.. చంద్రగ్రహణం వీడగానే అర్చకులు ఆయాన్ని శుద్ధి చేసి.. పూజా క్రతువులు నిర్వహిస్తున్నారు. గ్రహణ అనంతరం తిరుపతిలో ఉదయం.4.30 నిమిషాలకు అర్చకులు ప్రధాన ద్వారం, వెండి, బంగారు వాకిళ్లను తెరిచారు. సుప్రభాత సేవ నిర్వహించి స్వామిని మేల్కొలిపారు. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు.. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్చకస్వాములు ఆలయాన్ని శుద్ధి చేసి, అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకారం, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అన్నవరం, సింహాచలం, అరసవల్లి‌తో పాటు అన్ని క్షేత్రాల్లోనూ పూజా క్రతువులు ప్రారంభమయ్యాయి..

తెలంగాణలో పాక్షిక గ్రహణం వీడిన అనంతరం.. సంప్రోక్షణ తరువాత ఆలయాల్లో నిత్య పూజలను ప్రారంభించారు. యాదాద్రి, వేములవాడ, భద్రాచలం, కొండగట్టు దేవాలయం, బాసర జ్ఞానసరస్వతీ మాత, వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం, వేయి స్తంభాల గుడి తదితర ఆలయాల్లో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.. కొన్ని రాశులపై గ్రహణం ప్రభావం ఉంటుందని జ్యోతిషులు చెప్పడంతో గ్రహణదోష నివారణ పూజలు చేసేందుకు భక్తులు ఆలయాలకు తరలి వస్తుండటంతో ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి..

చంద్రగ్రహణం ప్రపంచ వ్యాప్తంగా 179 నిమిషాలపాటు గ్రహణాన్ని వీక్షించే అవకాశం కలిగింది. చంద్రగ్రహణాన్ని కోట్లాది మంది చూసి అద్భుతమైన అనుభూతిని పొందారు. హైదరాబాద్‌, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె నగరాల ప్రజలకు చంద్రగ్రహణం కనువిందు చేసింది. అర్ధరాత్రి తర్వాత 12.12 గంటలకు చంద్రుడు భూమి ఉపఛాయలోకి ప్రవేశించాడు. తర్వాత 1.31 నిమిషాలకు భూమి ప్రచ్ఛాయలోకి చంద్రుడు ప్రవేశించడంతో గ్రహణం ప్రారంభమైంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గరిష్ఠ గ్రహణం ఏర్పడింది.. 4.30 గంటలకు భూమి ప్రచ్ఛాయ నుంచి చంద్రుడు బయటకు రావడంతో గ్రహణం ముగిసినట్టయింది. ఈ పాక్షిక చంద్రగ్రహణం అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశమంతా కనిపించింది..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories