రంగంలోకి రాహుల్ గాంధీ.. చేవెళ్లలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం

రంగంలోకి రాహుల్ గాంధీ.. చేవెళ్లలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి శ్రీ కారం చుడుతోంది. ఈ నెల తొమ్మిదిన నిర్వహించే సభకు ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ హజరౌతున్నారు....

తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి శ్రీ కారం చుడుతోంది. ఈ నెల తొమ్మిదిన నిర్వహించే సభకు ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ హజరౌతున్నారు. చేవేళ్ల పహడి షరిఫ్‌లో నిర్వహించే సభకు కనీస ఆదాయ వాగ్ధాన సభగా పార్టీ నామకరణం చేసింది. రాహుల్ సభ కోసం హస్తం పార్టీనేతలు భారీ జనసమీకరణపై దృష్టిపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాభవం ఎదురవ్వడంతో పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్ల పై కన్నేసింది హస్తం పార్టీ. ముందస్తు అభ్యర్దుల ప్రకటనతోపాటు దాదాపు అభ్యర్దులు ఖరారైన స్థానాల్లో పార్టీ అధినేత రాహుల్ గాంధితో సభలు నిర్వహించాలని పార్టీ ప్లాన్ చేస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ మళ్లీ సెంటుమెంటు వైపు మొగ్గు చూపుతోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంటుమెంటుగా భావించే చేవెళ్ల స్థానం నుంచి హస్తం పార్టీ పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి సన్నద్ధమౌతోంది. ఈ నెల తొమ్మిదిన ఏఐసిసి అధినేత రాహుల్ గాంధి చేత చేవెళ్ల పార్టమెంటు స్థానంలో భారీ బహిరంగసభకు సిద్దమవుతోంది. ఈ సభకు కనీస ఆదాయ సభగా హస్తం పార్టీ నామకరణం చేసింది. ఈ సభలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించే కనీస ఆదాయ పథకం ఈ వేదిక నుంచి రాహుల్ గాంధి ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో బాగంగానే గాంధిభవన్ లో చేవెళ్ల పార్లమెంటు ముఖ్యనేతలతో పిసిసి భేటి నిర్వహించారు. సెంటిమెంటు కలిసి వచ్చే ప్రాంతం నుంచి ప్రచారం చేస్తే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నట్లున్నారు. రాహుల్ గాంధి కర్నాటక టూర్ ఈనెల 9వ తేదిన ఉన్నందున ఆ రోజు చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల ప్రచార సభకు ఏర్పాట్లు చేసుకుంటోంది. చేవేళ్ల పార్లమెంటు పరిధిలోని పహడి షరీఫ్ లో సభ ఏర్పాట్లు చేయడానికి పార్టీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

చేవెళ్లలో నిర్వహించబోయే పార్లమెంటు ఎన్నికల ప్రారంభ సభ కావడంతో సభకు దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది జనసమీకరణ ఉండేలా చూడాలని పార్టీ నిర్ణయంచిన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధి హాజరవుతున్న సభ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32 వేల పొలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను సభకు తరలించేలా పార్టీ చర్యలు చేపడుతోంది. ఈ సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై పార్టీ కార్యకర్తలకు రాహుల్ గాంధి దిశానిర్దేశం చేసేలా పార్టీ వ్యూహాన్ని రచిస్తోంది. దీనికి తోడు ఇక రాహుల్ గాంధీ సభలకు వరుసగా ఉండే విదంగా పార్టీ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories