Top
logo

అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ అనుమానాస్పద మృతి

అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ అనుమానాస్పద మృతి
Highlights

అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్ రావు అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....

అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్ రావు అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌ కౌంటర్‌ నుంచి సోమవారం బయటకు వస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు నీళ్లు తాగించి, హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story


లైవ్ టీవి