Top
logo

మద్యం మత్తులో చిందులేసిన వ్యవసాయ మార్కెట్ అధికారులు...

మద్యం మత్తులో చిందులేసిన వ్యవసాయ మార్కెట్ అధికారులు...
Highlights

మద్యం మత్తులో తమ స్థాయిని మరిచి చిందులేసారు కొందరు వ్యవసాయ మార్కెట్ అధికారులు.. పాటకు తగ్గ స్టెప్స్ వేస్తూ...

మద్యం మత్తులో తమ స్థాయిని మరిచి చిందులేసారు కొందరు వ్యవసాయ మార్కెట్ అధికారులు.. పాటకు తగ్గ స్టెప్స్ వేస్తూ డాన్సులతో రెచ్చిపోయారు .. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో హల్చల్ అవుతుంది . ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చోటు చేసుకుంది . గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీల అధికారులు ఈ మందు పార్టీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది . గంభీరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేందర్, ముస్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, ఇతర మార్కెట్ కమిటీల అధికారులు మద్యం సేవించి చిందులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ ప్రత్యక్షమైంది.

Next Story