సరిహద్దుల్లో 140 విమానాల మోహరింపు...ఆదేశాలు అందిన వెంటనే దాడులకు...

సరిహద్దుల్లో 140 విమానాల మోహరింపు...ఆదేశాలు అందిన వెంటనే దాడులకు...
x
Highlights

భారత్ పాకిస్థాన్ పై యుద్ధానికి సిద్దమవుతోంది. పాక్ సరిహద్దులో 140 విమానాలు మోహరించారు. ఆదేశాలు అందిన వెంటనే దాడులకు దిగేందుకు సిద్ధంగా ఉన్నారు....

భారత్ పాకిస్థాన్ పై యుద్ధానికి సిద్దమవుతోంది. పాక్ సరిహద్దులో 140 విమానాలు మోహరించారు. ఆదేశాలు అందిన వెంటనే దాడులకు దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి ఆపరేషన్‌ అయినా అమలు చేసేందుకు వైమానిక దళం రెడీ అయింది. జైషే మహహ్మద్ కు నిధులు ఇస్తున్న పాక్‌పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాకిస్థాన్ ను అష్ట దిగ్బంధం చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. వైమానిక, లక్ష్య ఛేధన సామర్థ్యం చాటుకునేందుకు సన్నద్దమైంది. ఇప్పటికే పాక్ నుంచి వచ్చే వస్తువులపై 200 శాతం సుంకుం పెంచిన ప్రభుత్వం మరింత ఒత్తిడి పెంచేందుకు సిద్ధమైంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత కేంద్రం చర్యలకు దిగింది. జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నేతలకు భద్రత ఉపసంహరించింది. నేతలకు కల్పించిన సౌకర్యాలు ఉపసంహరించింది. మిర్వాయిజ్ ఫరూక్, అబ్దుల్‌ఘనీ భట్‌, బిలాల్ లోన్, హషీం ఖురేషీ, షబీర్‌షాకు భద్రత ఉపసంహరించారు. భద్రత, వాహన శ్రేణి కూడా ఉపసంహరించాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories