కేటీఆర్‌ను కలిసిన నటుడు ప్రకాశ్‌రాజ్‌

Prakash Raj KTR
x
Prakash Raj KTR
Highlights

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ప్రధాని మోదీపై పదునైన అస్త్రాలతో ఇన్ని రోజులు విరుచుకుపడిన ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నట్టు నూతన సంవత్సర వేళ ప్రకటించారు.

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ప్రధాని మోదీపై పదునైన అస్త్రాలతో ఇన్ని రోజులు విరుచుకుపడిన ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నట్టు నూతన సంవత్సర వేళ ప్రకటించారు. ఈ ఏడాది జరిగే సార్వతిక్ర ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన ప్రకాశ్‌రాజ్‌ బుధవారం కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ గెలుపు నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశ్‌రాజ్, నూతన సంవత్సర గ్రీటింగ్స్‌ తెలిపారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రవేశ విషయమై కేటీఆర్‌తో చర్చించారు. అనంతరం కేటీఆర్‌తో భేటీ ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించిన ఆయన, తన రాజకీయ ప్రవేశానికి కేటీఆర్‌ ఇచ్చిన స్ఫూర్తి దాయక మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories