Top
logo

కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాబు మోహన్

కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాబు మోహన్
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత బాబు మోహన్ బాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు...

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత బాబు మోహన్ బాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పచ్చఅబద్దాల కోర్ అని వ్యాఖ్యనించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఎన్నికల వేళ వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆ విషయమే మర్చిపోయారని నిప్పులు చెరిగారు. సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని బాబు మోహన్ విమర్శించారు. ఈ లోక్‌సభ ఎన్నికలు ముఖ్యమంత్రి కోసం జరుగుతున్నవి కాదని, ప్రధానిని నిర్ణయించే ఎన్నికలు అని బాబు మోహన్ పేర్కొన్నారు. ఇటివల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఎంపీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయన్నారు. సర్జికల్ స్ట్రైక్‌లో ఎవరూ చనిపోలేదని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటివల కొండగట్టులో 60 మంది చనిపోతే బాధిత కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించలేదని బాబు మోహన్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే అభివృద్ధి ఎందుకు జరగడం లేదన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు దొరలబంధుగా మారిందని, ఐదు ఎకరాలలోపు ఉన్నవారికి ఇస్తే రైతుకు లాభం జరిగేదన్నారు.

Next Story