Top
logo

అభినందన్ ఎంట్రీ ఇవ్వగానే ఏం జరిగిందంటే?

అభినందన్ ఎంట్రీ ఇవ్వగానే ఏం జరిగిందంటే?
X
Highlights

దేశం కోసం ప్రాణాలొదిలేస్తారు వారు అనుకోని పరిస్థితుల్లో శత్రువు గుప్పిట చిక్కితే అంతు చిక్కని యుద్ధ...

దేశం కోసం ప్రాణాలొదిలేస్తారు వారు అనుకోని పరిస్థితుల్లో శత్రువు గుప్పిట చిక్కితే అంతు చిక్కని యుద్ధ వ్యూహాలు, తంత్రాలూ తమతోనే అంతం చేసేస్తారు తప్పితే శత్రు దళాలకు అస్సలు అప్పగించిన విషయం తెలిసిందే. గాయాల నుంచి పూర్తిగా కొలుకొని ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన పరీక్షల్లో ఫిట్ గా తేలడంతో అభినందన్ తిరిగి విధుల్లో చేరారు. అభినందర్ కు సహ ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. అభినందన్‌ను చూడగానే భావోద్వేగంతో అందరూ చుట్టుముట్టి సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. సుదీర్ఘ విరామం తర్వాత తన సహచరులను కలుసుకున్నారు. జమ్ము కశ్మీర్‌లోని ఐఏఎఫ్ బేస్ క్యాంప్‌లో సహోద్యోగులతో కాసేపు సరదాగా గడిపారు. అభినందన్‌తో కరచాలనం చేయడానికి, ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి చూపారు. అనంతరం ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఫిట్ నెస్ టెస్ట్ లోనూ అభినందన్ సక్సెస్ కావడంతో అధికారులు మళ్లీ అభినందన్ కోరుకున్న చోటనే జమ్మూలోనే పోస్ట్ చేశారు.

Next Story