త్వరలో వెండితెరపైకి అబ్దుల్ కలాం బయోపిక్ ..

త్వరలో వెండితెరపైకి అబ్దుల్ కలాం బయోపిక్ ..
x
Highlights

ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది .సమాజంలో మంచి గుర్తింపు సాధించిన వ్యక్తుల జీవిత కధల ఆధారంగా బయోపిక్ లను నిర్మిస్తున్నారు దర్శకనిర్మాతలు.. ఈ...

ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది .సమాజంలో మంచి గుర్తింపు సాధించిన వ్యక్తుల జీవిత కధల ఆధారంగా బయోపిక్ లను నిర్మిస్తున్నారు దర్శకనిర్మాతలు.. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రధాని మోడీ బయోపిక్ కూడా వెండితెర పైన ఆవిష్కరించారు . ఇప్పుడు అందులో భాగంగానే ఒకప్పటి మన దేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్ ని వెండితెరపైకి ఆవిష్కరించే ప్రయత్నం చేయబోతున్నారు ..

తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు అబ్దుల్ కలాం . తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు.

1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్థిగా ప్రతిపాదించబడగా, ప్రతిపక్ష కాంగ్రేస్ మద్దతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచారు. కలాం తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు.

శాటిలైట్ శాస్త్రవేత్తగా, భారతదేశానికి 11 వ రాష్ట్రపతిగా, భారతరత్న అవార్డు గ్రహీతగా అబ్దుల్ కలాం మన దేశనికి ఎన్నో సేవలు అందించారు . డ్రీమ్ మర్చెంట్స్ ఐఎన్ సి , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై రామాబ్రహ్మం సుంకర , అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు . బాలీవుడ్ లో మాత్రమే కాకుండా అన్ని భాషలలోను ఈ సినిమాని నిర్మించాలని నిర్మాతలు భావిస్తున్నారట .. త్వరలో ఈ సినిమా పట్టాలేక్కనుందని నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు .

Show Full Article
Print Article
Next Story
More Stories