మరోసారి బ్యాంకు ఉద్యోగుల సమ్మె

మరోసారి బ్యాంకు ఉద్యోగుల సమ్మె
x
Highlights

ప్రభుత్వరంగ బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మెబాటపట్టనున్నారు. ఉద్యోగవిధానాలపై కేంద్రసర్కార్‌ వ్యవహారిస్తున్న తీరును నిరసిస్తూ పది ట్రేడ్ యూనియన్లు ఈ సమ్మెకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వరంగ బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మెబాటపట్టనున్నారు. ఉద్యోగవిధానాలపై కేంద్రసర్కార్‌ వ్యవహారిస్తున్న తీరును నిరసిస్తూ పది ట్రేడ్ యూనియన్లు ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. యూనియన్ల పిలుపునిచ్చిన సమ్మెకు మద్దతుగా వచ్చే వారంలో రెండ్రోజులపాటు సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంకు సంఘాలు స్ఫష్టం చేశారు. ఈ మేరకు జనవరి 8, 9 తేదీలో దేశవ్యాప్త సమ్మెకు ఏఐబీఈఏ(అఖిల భారత బ్యాంక్) ఉద్యోగుల సంఘం మరియు బీఈఎఫ్ఐ(భారత బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య) సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ విషయాన్ని సదరు యూనియన్లు భారత బ్యాంకుల సంఘానికి ఐబీఏకు అందించాయని బీఎస్ఈ ఫైలింగ్ సందర్భంగా ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. ఇదే విషయంపై బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కూడా వెల్లడించింది. కాగా గత ఏడాది డిసెంబర్ నెలలోనూ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories