విడాకుల కోసం భర్త సంతకం పోర్జరీ చేసింది..!

విడాకుల కోసం భర్త సంతకం పోర్జరీ చేసింది..!
x
Highlights

పెళ్ళాం పిల్లలు బాగుండాలని ఓ భర్త దేశం విడిచి విదేశాలకు పోయాడు . నెలనెలకు డబ్బులు పంపిస్తున్నాడు. ఇంతా చేస్తున్న భర్తకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన ఓ...

పెళ్ళాం పిల్లలు బాగుండాలని ఓ భర్త దేశం విడిచి విదేశాలకు పోయాడు . నెలనెలకు డబ్బులు పంపిస్తున్నాడు. ఇంతా చేస్తున్న భర్తకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన ఓ భార్య ప్రియుడికి దగ్గర అయి భర్తను దూరం చేసుకోవాలని అనుకుంది . ప్రియుడు ని పెళ్లి చేసుకోవాలనే నేపధ్యంలో ఏకంగా విడాకుల కోసం భర్త అనుమతి లేకుండానే అతని సంతకాన్ని పోర్జరీ చేసింది . పోతూపోతూ ఏకంగా సొంత ఇల్లును కూడా అమ్మేసింది . ఈ ఘటన ముంబై లో చోటు చేసుకుంది .

విషయం తెలుసుకున్న భర్త ఆమెపై చీటింగ్ కేసు పెట్టాడు .యూసఫ్ షరీఫ్ మస్తాన్ , నిలోఫర్ అనే దంపతులు ముంబై లో నివాసం ఉంటున్నారు . వీరికి తోమిదేళ్ళ కొడుకు కూడా ఉన్నాడు . పెళ్ళాం పిల్లలు బాగుండాలని తానూ 2007లో యుఏఈకి వెళ్ళాడు . అక్కడ మెకానిక్ గా పనిచేస్తున్నాడు . ఇదే క్రమంలో నిలోఫర్ తన మాజీ ప్రియుడికి దగ్గరయింది .మస్తాన్ ఇంటికి వచ్చినప్పుడు నిలోఫర్ తన పేరుతో ఇల్లు కొనమని ఒత్తిడి చేయడంతో 23 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొన్నాడు మస్తాన్.

అ తరవాత మళ్లీ ఇండియా నుండి యుఏఈకి వెళ్ళాడు. తానూ కొనుకున్న ఇంట్లో మరెవరో ఉంటున్నారు అని తెలియడంతో ఎంక్వయిరీ చేయగా తన భార్య అదే ఇల్లును 32 లక్షలకి అమ్మేసినట్టు తెలుసుకున్నాడు . భర్త సంతకాన్ని పోర్జరీ చేయడం , విడాకులు ఇప్పించడంలో ఓ లాయర్ కూడా సహయం చేయడంతో భార్య పై కేసు నమోదు చేసారు మస్తాన్ . 2017లో మస్తాన్ విడాకులకు అప్ప్లయ్ చేసినట్టు విడాకుల పేపర్ల పైన సంతకం ఉండడం అ టైంలో మస్తాన్ యుఏఈ లో ఉండడం లాంటి అంశాలను పోలీసులు పరిగణలోకి తీసుకోని తన భార్యే మస్తాన్ సంతకాన్ని పోర్జరీ చేసిందని గుర్తించారు .

Show Full Article
Print Article
Next Story
More Stories