హాట్స్ ఆఫ్ : 45 విద్యార్థులను చదివిస్తూ తన కూతురుని చూసుకుంటున్నాడు

హాట్స్ ఆఫ్ : 45 విద్యార్థులను చదివిస్తూ తన కూతురుని చూసుకుంటున్నాడు
x
Highlights

ఆయన ఓ స్కూల్ లో క్లర్క్ గా పనిచేస్తున్నాడు . ఆయనకి ధనేశ్వరిని అనే కూతురు ఉండేది కానీ అనారోగ్యం చేత ఆమె చనిపోయింది . కన్న కూతురు చనిపోవడంతో భాదని తట్టుకోలేకపోయాడు .

ఆయన కన్న కూతురు అనారోగ్యంతో చనిపోయింది ... దీనితో అయన కూతురుతో జ్ఞాపకాలతో కొన్ని రోజులు ఏడిచాడు ... కానీ ఆ తరవాత ఓ గొప్ప నిర్ణయం తీసుకొని చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు . ఇక వివరాల్లోకి వెళ్తే బసవరాజ్‌ అనే అతను కర్ణాటకలో నివసిస్తూ ఉంటాడు .. ఆయన ఓ స్కూల్ లో క్లర్క్ గా పనిచేస్తున్నాడు . ఆయనకి ధనేశ్వరిని అనే కూతురు ఉండేది కానీ అనారోగ్యం చేత ఆమె చనిపోయింది . కన్న కూతురు చనిపోవడంతో భాదని తట్టుకోలేకపోయాడు . ఆమెతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కుమిలిపోయాడు . కానీ ఆ భాదలోనే ఓ గొప్ప నిర్ణయం తీసుకొని ఇప్పుడు చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు . తన స్కూల్ లో చదువుకునే 45 మంది పేద అమ్మాయిలకు ఫీజులు కడుతూ, వాళ్ళ చదువుకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తున్నాడు .. అలా వారిలో తన కూతురు చూసుకుంటున్నాడు . బసవరాజ్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అమ్మాయిల తల్లితండ్రులు ,స్కూల్ యాజమాన్యం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ధనేశ్వరి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories