Top
logo

కన్న కొడుకుకి కంటి పాపైన రాజమణి

కన్న కొడుకుకి కంటి పాపైన రాజమణి
X
Highlights

ప్రేమకు నిలువెత్తు రూపం మాతృ హృదయానికి నిజమైన అర్ధం తల్లి. 20 ఏళ్లగా పొత్తిళ్లలో కొడుకును మోస్తూ గుండెల్లో...

ప్రేమకు నిలువెత్తు రూపం మాతృ హృదయానికి నిజమైన అర్ధం తల్లి. 20 ఏళ్లగా పొత్తిళ్లలో కొడుకును మోస్తూ గుండెల్లో బాధను దిగమింగుతూ. కన్న ప్రేమతో కష్టాన్ని ఎదిరిస్తూ. కంటికి రెప్పలా కన్న బిడ్డను కాపాడుతూ అతడే సర్వస్వం అనుకొని బతుకుతోంది ఆ అమ్మ ఒక వైపు పేదరికం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. మరోవైపు వింత జబ్బుతో బాధపడుతున్న కుమారుడు. అయినా ఆమె కొడుకుని ఒదులుకోలేదు వదిలించుకోవాలనుకోలేదు. బిడ్డే తన సర్వస్వం అంటూ నేటికీ అతని భారాన్ని మోస్తూ తన బాధను పంటి బిగువున దాచిపెట్టిన ఓ తల్లి కథ ఇది.

ఈ వ్యక్తి పేరు రాజు. అతడికి సపర్యలు చేస్తున్న ఆమెపేరు రాజమణి పేరుకే కాదు రాజమణి ప్రాణాన్ని కూడా పంచుకొని పుట్టిన కొడుకే ఈ రాజు. 20 సంవత్సరాలుగా రాజు మాయదారి రోగంతో బాధపడుతున్నాడు. వింత జబ్బుతో నరకం అనుభవిస్తున్న బిడ్డకు 20 ఏళ్లుగా సపర్యలు చేస్తూ అలసిన అమ్మ ఆర్తనాదం అంతా ఇంతా కాదు. తనను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకుకి తానే కంటిపాపైయ్యింది తన కన్నీటిని బయటకు రాకుండా దిగమింగకుంటున్నతల్లి హృదయవేదన వర్ణనాతీతం.

ఇందిరాపార్కు బండమైసమ్మ కాలనీలో నివసించే రాజమణి. స్వీపర్ గా పనిచేస్తోంది ఆమె భర్త కూడా కూలి పని చేసుకుంటూ బతుకుతున్నాడు ఈ దంపతులకు ఒకేఒక్క కుమారుడు రాజు. చిన్న తనంలో రాజు కాస్త చురుగ్గానే ఉండేవాడు అయితే రాజు 11వ ఏట ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు కంగారు పడి అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా. వెన్నుపూస సమస్యని తేల్చారు వైద్యులు. అప్పటి నుంచి రాజు మంచానికి పరిమితమయ్యాడు. దీనికితోడు పోలియో లక్షణాలు కూడా బయటపడటంతో రాజు ఎదుగదల అక్కడితో నిలిచిపోయింది కాళ్లు, చేతులు చచ్చుబడ్డాయి.

కదల్లేని పరిస్థితుల్లో ఉన్న బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటోంది ఆతల్లి. అసలే పేదరికం దానికి తోడు రాజు వైద్యానికి ఖర్చులు. ఆ కుటుంబానికి భారంగా మారింది. భార్యాభర్తలిద్దరూ పనిచేయాల్సిందే. రాజమణి ఇందిరాపార్కులో స్వీపర్ గ పనిచేస్తుంది. కొడుకుని ఇంట్లో ఒంటరిగా వదిలేయడం ఇష్టంలేక అతడిని ఎత్తుకొని తీసుకెళ్తుంది. రాజమణి కష్టం చూడలేక కొంతమంది మెర్సీ కిల్లింగ్ చేయించమని సలహా ఇచ్చారు ఇంకొందరు ఆశ్రమంలో వదిలేసి చేతులు దులుపుకోమన్నారు అయినా ఆతల్లి ఒప్పుకోలేదు. కన్న కొడుకు కోసం ఎంత కష్టాన్నైనా భరించేందుకే సిద్ధమైంది. గుండెల్లో పట్టుకొని రాజును చూసుకుంటోంది.

రాజు పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తోంది. మెరుగైన వైద్యం చేయటానికి స్థోమత సరిపోవట్లేదని రాజమణి కన్నీరు మున్నీరవుతోంది. రాజకీయ నాయకులు, మనసున్న మహరాజులు తన కొడుకుని ఆదుకోవాలని అర్ధిస్తోంది కేటీఆర్‌ను కలిసి తన ఆవేదన చెప్పుకుందామని ఎన్నోసార్లు ప్రయత్నించిన కుదరలేదని అంటోంది రాజమణి.

రాజమణి ఒడిలో ఉన్న రాజుకు తన తల్లి బాధ అర్ధమౌతుందో లేదో తెలియదు. ఆమె మనసు పడే క్షోభ, బాధ తనకి తప్ప ఇంకొకరికి తెలియదు కానీ ఆమె కష్టాన్ని అర్ధం చేసుకునే మనసు అందరికీ ఉంటుంది ఆ అమ్మ కష్టాన్ని పంచుకోక పోయినా కనీసం సాయం చేయండి ఆమె బాధకు మీవంతు ఓదార్పునివ్వండి.


Next Story