Top
logo

బోరు బావిలో పడిన ఆరేళ్ల బాలుడు

బోరు బావిలో పడిన ఆరేళ్ల బాలుడు
X
Highlights

ఆరేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని అంబగామ్...

ఆరేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని అంబగామ్ గ్రామంలో ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడ్డాడు పది అడుగుల లోతులో ఉన్న బాలుడిని కాపాడేందుకు పోలీసులు, జాతీయ విపత్తు సహాయ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి పక్కనే సమాంతరంగా గుంత తవ్వారు. పది అడుగుల లోతులోనే బాలుడు ఉండటంతో పది అడుగుల గుంత సమాంతరంగా తీసి సిబ్బంది బాలుడి వద్దకు చేరారు. బాలుడ్ని కాపాడి ఆసుపత్రికి తరలించారు.

Next Story