ఆరేళ్లకే కత్తెర పట్టిన చైనా చిన్నోడు

ఆరేళ్లకే కత్తెర పట్టిన చైనా చిన్నోడు
x
Highlights

ఆరేళ్ల అబ్బాయికి ఏం తెలుసు. మహా అంటే అమ్మ అన్నం పెడితే ఇప్పుడే వస్తా అంటూ పక్కింట్లోకి దూరడం లేదంటే తన ఫ్రెండ్ దగ్గరకు పరిగెత్తడం చేస్తాడు.

ఆరేళ్ల అబ్బాయికి ఏం తెలుసు. మహా అంటే అమ్మ అన్నం పెడితే ఇప్పుడే వస్తా అంటూ పక్కింట్లోకి దూరడం లేదంటే తన ఫ్రెండ్ దగ్గరకు పరిగెత్తడం చేస్తాడు. చెల్లి గురించో అక్క లేక అన్న గురించో ఫ్రెండ్స్‌ గురించో ఏవో కంప్లైంట్లు చేస్తాడు. మరి వీడేంటో కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. కత్తెర పట్టుకుని చకచకా కట్ చేసేస్తున్నాడు. అసలు ఈ బుజ్జిగాడి మ్యాటరేంటో తెలియాలంటే స్టోరీకి ఎంటర్ కావాల్సిందే.

పిన్న వయస్సులో వేలలో సంపాదన లక్షల ఫాలోవర్లు ఇది ఈ చిన్నోడి స్టామినా ఒక్కమాటలో చెప్పాలంటే బంగారు బాతు లాంటి బాబు. చైనాకు చెందిన ఈ చిన్నోడు అందమైన కురులకు మెరుగులు దిద్దితున్నాడు. గట్టిగా నిలబడటం కూడా రాని బుజ్జిగాడు కత్తెర పట్టుకుని చకచక హెయిర్‌ కట్‌ చేస్తున్నాడు. ట్రెండ్‌కు తగ్గట్లు నయా హెయిర్‌ స్టైల్స్‌ నిమిషాల్లో చేయడంలో ఫేమస్‌ కావడంతో అమ్మాయిలంతా ఆరేళ్ల ఆ బుజ్జిగాడి చేతికి జుట్టందిస్తున్నారు.

సిచువాన్ రాష్ట్రంలో ఉన్న సూనింగ్ టౌన్‌లోని సెలూన్ దగ్గర బుడ్డోడి కటింగ్‌ కోసం ఆడ, మగ అని తేడా లేకుండా బారులు తీరుతారు. ఫుల్‌ కస్టమర్లతో కిటకిటలాడుతోంది ఈ సెలూన్‌. కుదురుగా కూర్చుని హోం వర్క్ చేయడాని క్కూడా అమ్మని సతాయించే వయసున్న పిల్లాడు ఎన్నో సంవత్సరాలు నైపుణ్యం ఉన్న బార్బర్‌లా జుట్టు ట్రిమ్ చేయడం, ఎలక్ట్రిక్ రేజర్లు, ప్లాట్ దువ్వెనతో కటింగ్ చేయడం, డ్రై చేయడం లాంటి పనులన్నీ ఈజీగా చేసేస్తున్నాడు. దీంతో చిన్నోడి కటింగ్‌కు ఫిదా అయిన యువత జియాంగ్ హోంగ్ క్వీ కి కోసం క్యూ కడుతున్నారు.

సీనియర్ హెయిర్ స్టయిలిస్టులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ట్రిమ్ చేస్తుంటే సమ్మగా ఉందంటున్నారు కస్టమర్లు. అయితే నాన్న సెలూన్ రన్ చేస్తుంటే రోజూ వచ్చి గమనించేవాడట ఈ పిల్లాడు. అల్లరి చిల్లరగా అటూ ఇటూ తిరిగి అదీ ఇదీ పడేయకుండా నాన్న చేసే పనిని చూసి ఇట్టే పట్టేశాడని చెబుతున్నారు తల్లిదండ్రులు. పదేళ్ల వయసుకూడా రాకముందే నాన్నకు పోటీ ఇస్తున్నాడు. నాలుగేళ్ల నుంచే జియాంగ్ ఈ పని చేయడం మొదలెట్టేసాడు. సోషల్ మీడియాలో తనకో పేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తన ట్విట్టర్లో 15 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. జియాంగ్ కటింగ్, ట్రిమ్మింగ్ వీడియో వైరల్ అవుతోంది.





Show Full Article
Print Article
Next Story
More Stories