పోలీసులకు చుక్కులు చూపించిన బుడ్డోడు

పోలీసులకు చుక్కులు చూపించిన బుడ్డోడు
x
Highlights

విజయవాడలో నాలుగేళ్ల బుడ్డోడు పోలీసులకు చుక్కలు చూపాడు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే బెంజిసర్కిల్‌లోకి బ్యాటరీ కారుతో వచ్చి ట్రాఫిక్‌ పోలీసులను పరుగులు...

విజయవాడలో నాలుగేళ్ల బుడ్డోడు పోలీసులకు చుక్కలు చూపాడు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే బెంజిసర్కిల్‌లోకి బ్యాటరీ కారుతో వచ్చి ట్రాఫిక్‌ పోలీసులను పరుగులు పెట్టించాడు. పోలీసులు తనను గుర్తించారని గమనించిన ఆ నాలుగేళ్ల బాలుడు రివర్స్‌ గేర్‌ వేసి తప్పించుకోవాలని చూడడం స్థానికులను ఆశ్చర్యపరిచింది.

విజయవాడలోని పీఅండ్‌టీ కాలనీకి చెందిన నాలుగేళ్ల చిన్నారి కాలికి గాయమైంది. దీంతో ఆ చిన్నారిని తల్లిదండ్రులు పాఠశాలకు పంపించకుండా ఇంటి వద్దే ఉంచారు. ఎప్పటిలాగే బ్యాటరీ కారుతో వీధిలో ఆడుకుంటాడని భావించిన తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆ కారును నడుపుకుంటూ రద్దీగా ఉండే బెంజిసర్కిల్‌లోకి వచ్చాడు.

నిన్న ఉదయం 9 గంటల ప్రాంతంలో రోడ్డుపై బుడతడిని ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు చిన్నారి కారును ఆపేందుకు ప్రయత్నించారు. వాహనాలు అతడిని దాటుకుంటూ వెళుతుంటే పోలీసులు పరుగులు పెట్టారు. వారిని చూసిన ఆ చిన్నారి రివర్స్‌ గేర్‌ వేసి ఇంటికి వెళ్లిపోవాలని చూశాడు. కాసేపటి తర్వాత ఎట్టకేలకు పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఇంతలో బాలుడిని వెతుక్కుంటూ వచ్చిన తల్లిదండ్రులకు అప్పగించి వారిని హెచ్చరించి పంపించారు. బుడతడి చేష్టలు చూసి ముక్కున వేలేసుకోవడం స్థానికుల వంతైంది.


Show Full Article
Print Article
Next Story
More Stories