ఏపీలో ఎన్టీఆర్ ఇళ్ల పండుగ...ఒకేరోజు 4లక్షల గృహప్రవేశాలు

ఏపీలో ఎన్టీఆర్ ఇళ్ల పండుగ...ఒకేరోజు 4లక్షల గృహప్రవేశాలు
x
Highlights

ఏపీ ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి తెరలేపింది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పేదలకు నిర్మించిన పక్కా ఇళ్లను ఇవాళ అందించబోతోంది. పేదలతో కలిసి...

ఏపీ ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి తెరలేపింది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పేదలకు నిర్మించిన పక్కా ఇళ్లను ఇవాళ అందించబోతోంది. పేదలతో కలిసి సామూహిక గృహప్రవేశాలను నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. మూడో విడత సందర్భంగా 4 లక్షల ఇళ్లల్లో సామూహిక గృహప్రవేశాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

నిరుపేదలకు ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో నిర్మించిన ఎన్టీయార్ పక్కా గ్రుహాలు కాసేపట్లో లబ్దిదారుల సొంతం కానున్నాయి. దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం నిర్మించిన ఈ భవన సముదాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరులో ప్రారంభించనున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా సామూహిక ప్రవేశాలు నిర్వహించిన ప్రభుత్వం ఎన్నికల ముంగిట మూడో విడతలో 4 లక్షల ఇళ్లల్లో గృహ ప్రవేశాలు చేయబోతున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 3 లక్షలు, పట్టణ పరిధిలో లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహిస్తున్నారు.

ఇవాళ ఉదయం నెల్లూరులో, మధ్యాహ్నం తిరుపతిలో నిర్వహించనున్న గృహప్రవేశాలకు సీఎం చంద్రబాబు హాజరవుతారు. మార్చ్ లోపు 19 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతల్లో 5 లక్షల 80 వేల ఇళ్లను పేదలకు అందజేశారు. తాజాగా మరో 4 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలను నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 13 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 7.5 లక్షల ఇళ్లను నిర్మించాలని సంకల్పించారు.

రాష్ట ప్రభుత్వం ప్రయోగాత్మకంగా, ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఈ గృహ సముదాయాల్లో ఆధ్యంతం ఆదునిక సాంకేతికత ఉట్టి పడుతోంది. మహానగరాల్లో నిర్మాణ సంస్థలకు ఉపయోగించే షేర్ వాల్ టెక్నాలజితో పాటు అంతే స్థాయి సౌకర్యాలను కల్పిస్తోంది. భూ కంపాల వంటి ప్రకృతి విపత్తులను సైతం తట్టుకోగలిగే విధంగా నిర్మించారు.

సింగపూర్, జపాన్ లాంటి నగరాల్లో ఉండే భూగర్బ డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ, చెత్త శుద్ధి కేంద్రాలు, పాఠశాలలు, వైద్య సౌకర్యాలు, పార్కులు, మొక్కల పెంపకాలు, వాటి చుట్టూ రోడ్లు, గృహ సముదాయాల నలువైపులా ప్రహరీ నిర్మాణంతో ఈ గృహాలను పూర్తి చేసింది. పేదల కలల సాకారంగా నిర్మించిన ఈ పక్కా గృహాల కోసం లబ్దిదారులకు 30 ఏళ్ల పాటు చెల్లించేలా సరికొత్త రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories