బోరుబావిలోని బాలుడు మృతి.. 109 గంటల శ్రమ వృథా

బోరుబావిలోని బాలుడు మృతి.. 109 గంటల శ్రమ వృథా
x
Highlights

పంజాబ్‌లో బోరుబావిలో పడ్డ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 5 రోజుల పాటు శ్రమించి ఈ ఉదయం ప్రాణాలతో బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది ఫతేవీర్‌సింగ్‌ను ఆస్పత్రికి...

పంజాబ్‌లో బోరుబావిలో పడ్డ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 5 రోజుల పాటు శ్రమించి ఈ ఉదయం ప్రాణాలతో బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది ఫతేవీర్‌సింగ్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గత గురువారం రోజు సంగ్రూర్‌ గ్రామంలో రెండేళ్ల బాలుడు ఫతేవీర్‌ సింగ్‌ ఆడుకుంటూ ప్రమదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్‌ టీం రంగంలోకి దిగింది. బోరుబావికి సమాంతరంగా మరో బావిని తవ్వి సహాయక చర్యలు చేపట్టారు. ఓ వైపు పైప్‌లతో ఆక్సిజన్ అందిస్తూనే సహాయక చర్యలు చేపట్టింది. బోరుబావిలోకి కెమెరాలు పంపించి బాలుడి పరిస్థితిని తెలుసుకున్నారు. 150 అడుగుల లోతులో బాలుడు చిక్కుకున్నట్లు గుర్తించారు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న రెస్క్యూ సిబ్బంది 109 గంటల పాటు తీవ్రంగా శ్రమించి రెండేళ్ల బాలుడ్ని ప్రాణాలతో బయటకు తీశారు. వెంటనే అంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories