కిడ్నీ రాకెట్‌లో కొత్త కోణం..బయట పడుతున్న...

కిడ్నీ రాకెట్‌లో కొత్త కోణం..బయట పడుతున్న...
x
Highlights

కిడ్నీ రాకెట్‌ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. శ్రద్ధా ఆస్పత్రి అడ్మిన్‌ జే కుమార్‌ వర్మను రెండో రోజు విచారించిన...

కిడ్నీ రాకెట్‌ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. శ్రద్ధా ఆస్పత్రి అడ్మిన్‌ జే కుమార్‌ వర్మను రెండో రోజు విచారించిన అధికారులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లపై మరింత సమాచారం సేకరించారు. 2016 నుంచి 2019 మధ్య కిడ్నీ మార్పిడి అపరేషన్లు జరిగాయని నిర్ధారించారు. అయితే ఇందులో 23 కిడ్నీ ఆపరేషన్లకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. కిడ్నీ మార్పిడులు చేస్తూ మధ్యవర్తిత్వం వహిస్తున్న వారికి కమిషన్లు కూడా చాలానే ముట్టాయనే విషయం వెలుగులోకొచ్చింది. ఇటు పరారీలో ఉన్న శ్రద్ధా ఆస్పత్రి ఎండీ ప్రదీప్‌ను పట్టుకునేందుకు 5 బృందాలు గాలిస్తున్నాయి. అయితే కిడ్నీ మార్పిడికి సంబంధించిన అనుమతులు, నిబంధనలపై డీఎంఈ, డీఎం అండ్‌ హెచ్‌ఓలకు వివరణ కోరుతూ పోలీసుల లేఖ రాశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories