నిజామాబాద్‌‌ పార్లమెంట్‌కి రికార్డు స్థాయిలో నామినేషన్లు..

నిజామాబాద్‌‌ పార్లమెంట్‌కి రికార్డు స్థాయిలో నామినేషన్లు..
x
Highlights

తెలంగాణలోని నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 245 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ నెల 18న నామినేషన్ల...

తెలంగాణలోని నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 245 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ నెల 18న నామినేషన్ల ప్రారంభం నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేస్తుండగా ఇవాళ ఒక్కరోజే 179 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం నామినేషన్లలో 230 రైతులకు చెందినవే ఉన్నట్టు తెలుస్తోంది. అత్యధిక నామినేషన్లు రావడంతో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహించేందుకు రెడీ అయ్యింది ఎన్నికల సంఘం.

నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, ధర్మపురి అరవింద్, మధుయాష్కి‌ లాంటి నేతలు అదనపు సెట్లతో నామినేషన్లు దాఖలు చేయగా పసుపు, ఎర్రజొన్న, చెరుకు రైతులు కూడా భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. దీంతో నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి నామినేషన్లు వేసిన వారి సంఖ్య 245 మందికి చేరింది.

నామినేషన్ల చివరిరోజున జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల రైతులు అధిక సంఖ్యలో నామినేషన్లు వేశారు. వీరికి సంఘీభావంగా ఆయా ప్రాంతాల నాయకులు కూడా తరలివచ్చారు. ఐదేళ్లుగా రైతుల సమస్యలు పరిష్కరించడంలో ఎంపీ కవిత విఫలమయ్యారని, పసుపు బోర్డు ఏర్పాటులో నిర్లక్ష్యం వహించారని రైతులు ఆరోపించారు.

అయితే, అభ్యర్థుల సంఖ్య 96లోపు ఉంటే ఈవీఎం పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, నిజామాబాద్‌లో ఏకంగా అభ్యర్థుల సంఖ్య 245కు చేరడంతో ఎన్నికల సంఘం బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. అయితే, నిజామాబాద్‌లో రైతులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోకుంటే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగడం ఖాయం. ఒకవేళ ఇదే జరిగితే ప్రధాన పార్టీల అభ్యర్థుల గుర్తులు వెతుక్కోవాల్సి పరిస్థితి వస్తుంది. మరి నామినేషన్లు ఉపసంహరించుకునేది ఎందరు బరిలో నిలిచేది ఎందరన్నది ఆసక్తిగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories