Top
logo

మండుటెండల్లోనూ హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారాలు..

మండుటెండల్లోనూ హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారాలు..
X
Highlights

భానుడు భగభగమంటున్నా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నా ఏపీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రంలోని...

భానుడు భగభగమంటున్నా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నా ఏపీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రంలోని పాలక,ప్రతిపక్షాలకు తోడు కేంద్రంలోని జాతీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం ముగిసేందుకు 9 రోజులు మాత్రమే మిగిల ఉండటంతో జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు తెలుగు రాష్ట్రాల్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఏపీలోని రాజమండ్రితో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఇక కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలోని మూడు బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. జహీరాబాద్‌, వనపర్తి, హ‍జూర్‌‌నగర్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు నేడు కడప, చిత్తూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జగన్ ఇలాఖా పులివెందులతో పాటు జమ్ములమడుగు, తంబళ్లపల్లె, పూతలపట్టు ఎన్నికల సభల్లో పాల్గొంటారు. ప్రతిపక్ష నేత జగన్ నేడు నాలుగు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. విజయ నగరం జిల్లా శృంగవరపు కోట, విశాఖ జిల్లా పెందుర్తి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు .

బీజేపీ, కాంగ్రెస్‌లే టార్గెట్‌గా టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. సీఎం కేసీఆర్ ఈ రోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రోడ్‌షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ నేడు హైదరాబాద్ పరిధిలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఎల్బీనగర్‌, మహేశ్వరం పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మాజీ మంత్రి హరీష్‌రావు కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీహెచ్‌ఈల్‌,పటాన్‌చెరుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Next Story