logo

ఎన్నికల ముందు ఏపీలో భారీగా బదిలీలు

ఎన్నికల ముందు ఏపీలో భారీగా బదిలీలు
Highlights

ఏపీలో 12 మంది IAS అధికారుల బదిలీలు జరిగాయి. ఎన్నికల కమీషన్‌ నిబంధనల మేరకు పర్యాటక శాఖ కార్యదర్శిగా ముఖేష్‌...

ఏపీలో 12 మంది IAS అధికారుల బదిలీలు జరిగాయి. ఎన్నికల కమీషన్‌ నిబంధనల మేరకు పర్యాటక శాఖ కార్యదర్శిగా ముఖేష్‌ కుమార్‌‌ మీనా ఎక్సైజ్‌ కమీషనర్‌గా బదిలీ అయ్యారు. పర్యాటక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఎక్సైజ్‌ కమీషనర్‌గా ఉన్న లక్ష్మీకాంతంను చేనేత, జౌళీ శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఎస్‌ఎస్‌ నరేష్‌ పరిశ్రమల వాణిజ్య శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. గనుల శాఖ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. బి.శ్రీధర్‌ పశు సంవర్థక శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఎం.రామారావు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ఉన్న ధనుంజయ్‌ రెడ్డిని ఏపీటీడీసీ ఎండీగా బదిలీ చేశారు. ఇక గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ని కృష్ణా జిల్లా కలెక్టర్‌గా, కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతంని టీటీడీ పరిపాలన జేఈఓగా బదిలీ చేశారు.


లైవ్ టీవి


Share it
Top