పల్లె పోరుకు భారీగా పోటీ...రికార్డు స్థాయిలో...

పల్లె పోరుకు భారీగా పోటీ...రికార్డు స్థాయిలో...
x
Highlights

తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు మే 6న నిర్వహించే తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరిరోజైన నిన్న భారీగా నామినేషన్లు...

తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు మే 6న నిర్వహించే తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరిరోజైన నిన్న భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. తొలిదశ పోలింగ్ జరిగే 2,166 ఎంపీటీసీ స్థానాలకు దాదాపుగా 13వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 197 జడ్పీటీసీ స్థానాలకు సుమారు 2వేలకు పైగా నామినేషన్లు వచ్చాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం జడ్పీటీసీ స్థానానికి రికార్డు స్థాయిలో 107 నామినేషన్లు దాఖలయ్యాయి.

మండలాల్లోని రిటర్నింగ్ అధికారులు ఇవాళ నామినేషన్లు పరిశీలిస్తారు. రేపు నామినేషన్లపై వచ్చే అభ్యంతరాలను స్వీకరిస్తారు. అలాగే రేపటి నుంచి 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఇచ్చారు. నిబంధనల ప్రకారం దాఖలు చేసిన అభ్యర్థుల పేర్లతో రిటర్నింగ్ అధికారులు జాబితాలను తయారు చేస్తారు.

నామినేషన్ల స్వీకరణ సోమవారం మొదలు పెట్టగా మొదటి రెండు రోజులు నామమాత్రంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. చివరిరోజైన బుధవారం మండల కేంద్రాలు కోలాహలంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు , వారి మద్దతుదారులతో మండల కేంద్రాలు కిటకిటలాడాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఒక్కో దానికి ఎక్కువ మంది పోటీ పడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories