Top
logo

ఈబీసీ రిజర్వేషన్ ఎంత మందికి వర్తించనుంది..?

Reservation
X
Reservation
Highlights

పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం లభించడంతో ఈ రిజర్వేషన్‌ వర్తించే వారు ఎంత మంది ఉంటారన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం లభించడంతో ఈ రిజర్వేషన్‌ వర్తించే వారు ఎంత మంది ఉంటారన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజా లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లు ప్రకారం, ఎనిమిది లక్షల రూపాయల్లోపు ఆదాయం.. ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న వారు మాత్రమే రిజర్వేషన్‌కు అర్హులు. ఈ అర్హతా ప్రమాణాల ప్రకారం, దాదాపు ప్రజలందరికీ ఈ రిజర్వేషన్‌ వర్తించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన పలు సర్వేల ప్రకారం, ఐదెకరాలలోపు భూమి ఉన్నవారు 80 శాతంపైగా ఉన్నారు. 2018లో విడుదల చేసిన 2015-2016 వ్యవసాయ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం రైతులలో 86 శాతం మందికి ఐదెకరాల్లోపు భూములే ఉన్నాయి. వీరంతా ఈబీసీ రిజర్వేషన్‌కు అర్హత పొందుతారు. దేశవ్యాప్తంగా 14.57 కోట్ల మంది రైతులు ఉంటే, అందులో ఐదెకరాల్లోపు భూమి ఉన్నవారు 12.56 కోట్ల మంది ఉన్నారు.

ఆదాయ పరిమితిని పరిగణనలోకి తీసుకుంటే, దేశ ప్రజల్లో 99 శాతం మందికి ఎనిమిది లక్షల్లోపే ఆదాయం ఉంది. ఎనిమిది లక్షలలోపు ఆదాయం ఉండాలంటే నెలవారీ ఆదాయం సుమారు 66వేల రూపాయిలలోపు ఉండాలి. NSSO 2011-12 నివేదిక ప్రకారం 95 శాతం కుటుంబాల ఆదాయం నెలకు 23వేల 375 రూపాయలే ఉంది. 99 శాతం కుటుంబాల ఆదాయం 48.83 శాతం మాత్రమే ఉంది. దీంతో 66 వేల ఆదాయం మార్కు దాటిన వాళ్లు అర శాతం కూడా ఉండరు. ఇంట్లో ఐదుగురు కష్టపడే కుటుంబాల ఏడాది ఆదాయం కూడా ఎనిమిది లక్షలు దాటడం లేదు. దీంతో ఆదాయాన్ని బట్టి చూస్తే, 99శాతం కుటుంబాలకు ఈ రిజర్వేషన్ వర్తించనుంది.

Next Story