అభినందన్‌‌కు రా, ఐబీ అధికారులు విచారణ తప్పదా..?

అభినందన్‌‌కు రా, ఐబీ అధికారులు విచారణ తప్పదా..?
x
Highlights

వర్థమాన్ అభినందన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్. ఈ పేరు ఇప్పుడు భారతీయుల నోట మార్మోగుతోంది. పాక్ చెర నుంచి విడుదలైన అభినందన్.. ఇప్పుడు ఎక్కడున్నారు...ఏం...

వర్థమాన్ అభినందన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్. ఈ పేరు ఇప్పుడు భారతీయుల నోట మార్మోగుతోంది. పాక్ చెర నుంచి విడుదలైన అభినందన్.. ఇప్పుడు ఎక్కడున్నారు...ఏం చేస్తున్నారు. పాక్ బందీగా ఉన్న సమయంలో చిత్రహింసలు ఎదుర్కొన్నారా..? అభినందన్ మానసిక స్థితి బాగానే ఉందా..? అభినందన్‌‌కు రా, ఐబీ అధికారులు విచారణ తప్పదా..?

పాకిస్థాన్ చెర నుంచి విడుదలైన వింగ్ కమాండర్ అభినందన్‌ వర్థమాన్‌ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. ఢిల్లీ ఆర్ ఆర్ ఆస్పత్రిలో ఉన్న అభినందన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఆమె కలిశారు. అభినందన్ ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. రక్షణ మంత్రి రాక సందర్భంగా యూనిఫామ్‌ను ధరించి డ్యూటీలో ఉన్న సైనికుడిలా అభినందన్‌ తయారయ్యారు. దేశం కోసం అంకితభావంతో పోరాడిన అభినందన్‌ వర్థమాన్‌ను నిర్మలా సీతారామన్ అభినందించారు. పాకిస్తాన్‌లో ఉన్న 60 గంటల సమయంలో ఏమేం జరిగిందో ఆయన మంత్రికి అభినందన్ వివరించారు.

అభినందన్‌ శారీరక, మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రిలో పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. శత్రువు చేతిలో చిక్కుకుని, తీవ్ర మానసిక క్షోభను అనుభవించినందు వల్ల అతని మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ పరీక్షలు చేస్తారు. పాకిస్తాన్‌ సైన్యం అతనికి మత్తు పదార్థాలు ఇచ్చిందీ లేనిదీ, అలాగే అతని శరీరంలో రహస్య బగ్‌ల వంటివి అమర్చింది నిర్ధారించడానికి స్కానింగ్‌లు నిర్వహిస్తారు. అయితే పాకిస్థాన్‌లో మానసిక వేధింపులకు గురయ్యాయని వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌ చెప్పినట్టు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. పాకిస్థానీల చేతుల్లో శారీరక హింసకు గురి కాలేదు కానీ, మానసిక వేధింపులు మాత్రం ఎదుర్కొన్నానని అభినందన్ చెప్పినట్లు తెలిపాయి.

మరోవైపు అభినందన్ అప్పగింతకు సంబంధించిన పత్రాలను ఆర్మీ విడుదల చేసింది. వాఘా సరిహద్దు దగ్గర పాక్ జవాన్లు భారత ఆధికారులకు అభినందన్‌ను అప్పగించిన సమయంలో ఇచ్చిపుచ్చుకున్న సర్టిఫికెట్‌ను మీడియాకు అందచేశారు. ఈ పత్రాల్లో ఆభినందన్‌ను యుద్ధ ఖైదీ నంబర్ 27981 గా పేర్కొన్నారు. అలాగే అభినందన్‌ దగ్గర ఉన్న రిస్ట్ వాచ్ , రింగ్ , కళ్ళ జోడు గురించి ప్రస్తావించారు. అయితే అభినందన్ పిస్టల్‌ గురించికానీ ఆయన దగ్గర ఉన్న మ్యాపులు, సర్వైవల్‌ కిట్‌ గురించి కానీ ఈ పత్రాల్లో పేర్కొనలేదు. అభినంతన్ మన దేశానికి చేరుకున్నప్పుడు ఆయన ఖాళీ చేతులతో కనిపించారు. ఇవేవి ఆయన వెంట వచ్చినట్లు కనిపించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories