బర్త్‌ డే పార్టీలో అశ్లీల నృత్యాలు

బర్త్‌ డే పార్టీలో అశ్లీల నృత్యాలు
x
Highlights

పశ్చిమగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. పెనుమంట్ర మండలం మార్టేరులో ఒక కళ్యాణ మండపంలో రాత్రి రేవ్ పార్టీ నిర్వహించారు. పోడూరు మండలం కవిటంకు...

పశ్చిమగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. పెనుమంట్ర మండలం మార్టేరులో ఒక కళ్యాణ మండపంలో రాత్రి రేవ్ పార్టీ నిర్వహించారు. పోడూరు మండలం కవిటంకు చెందిన ఒక వ్యాపారవేత్త తన పుట్టినరోజు సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. నలుగురు యువతులతో అసభ్య నృత్యాలు నిర్వహించారు. ఈ రేవ్ పార్టీకి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు హాజరైనట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అర్థరాత్రి కళ్యాణమండపానికి వెళ్లారు. అమ్మాయిలు డ్యాన్సులు వేయడాన్ని చూడటంతో నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, యువతనులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిర్వాహకులను మాత్రం వదిలిపెట్టేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories