నిరాశలో నాన్ వెజ్ ప్రియులు..

నిరాశలో నాన్ వెజ్ ప్రియులు..
x
Highlights

ఆదివారం వచ్చిదంటే చాలు మెజార్టీ ఇళ్లలో నాన్ వెజ్ గుమగు మలు ఉండాల్సిందే. కానీ గత రెండు వారాల నుంచి ఆ పరిస్థితి లేదు. చికెన్ ధర కొండెక్కింది. మటన్ రేట్...

ఆదివారం వచ్చిదంటే చాలు మెజార్టీ ఇళ్లలో నాన్ వెజ్ గుమగు మలు ఉండాల్సిందే. కానీ గత రెండు వారాల నుంచి ఆ పరిస్థితి లేదు. చికెన్ ధర కొండెక్కింది. మటన్ రేట్ మడిపోతుంది. రోజురోజుకు నాన్ వెజ్ రేట్లు పెరుగుతుండడంతో మాంసహార ప్రియుల్లో ఆనందం కరవైంది. సాధారణంగా ఎండకాలంలో చికెన్‌ ధర తక్కువగా ఉంటోంది. కానీ ఈసారి చలికాలంలో కంటే వేసవిలో చికెన్‌ ధర పెరుగుతోంది. మండుతున్నధరతో మాంసహార ప్రియులు ఆందోళన చెందుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుతం కిలో చికెన్ 230 రూపాయలు పలుకుతోంది. స్కిన్ లెస్ చికెన్ కిలో 250 రూపాయలకు అమ్ముతున్నారు. గత రెండు వారాల్లో చికెన్ రేట్ 70 నుంచి 80 రూపాయల వరకు పెరిగింది. కోడి మాంసం తరహాలోనే గొర్రెల, మేకల మాంసం రేట్లు భగ్గుమంటున్నాయి. 450 రూపాయలు వున్న మటన్ రేట్ ఆరు వందల రూపాయల వరకు చేరుకుంది. చికెన్, మటన్ రేట్లు చేసి వినియోగదారులు ఖంగుతింటున్నారు.మామూలుగా కొనాల్సి దాని కన్న తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నారు.

ఇప్పటికే మండుతున్న ఎండలతో కూరగాయల రేట్లు పెరిగాయి. పదిహేను రోజుల క్రితం ఇరవై రూపాయలకు కిలో వున్న టామాటా ఇప్పుడు ధర ఇప్పుడు యాభై రూపాయలకు చేరుకుంది. ఇదే మాదిరిలో ఇతర కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. వేసవిలో నీటి కటకటతో కూరగాయల సరిగ్గా పండడంలేదు. తీవ్ర ఎండలకు తాళలేక కోళ్లు మృతి చెందుతున్నాయి. డిమాండ్ కు తగ్గట్లు ఉత్పత్తి లేకపోవడంతో చికెన్ రేట్ పెరుగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories