నిజామాబాద్‌లో అమల్లోకి వచ్చిన కొత్త విధానం..కెమెరాలతో..

నిజామాబాద్‌లో అమల్లోకి వచ్చిన కొత్త విధానం..కెమెరాలతో..
x
Highlights

పోలీసులు లాఠీలతో భయపెట్టే రోజులు పోయి ఫొటోలతో భయపెట్టే రోజులొచ్చాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా తెలంగాణ పోలీసులు లాఠీలను పక్కన పెట్టి కెమెరాలతో...

పోలీసులు లాఠీలతో భయపెట్టే రోజులు పోయి ఫొటోలతో భయపెట్టే రోజులొచ్చాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా తెలంగాణ పోలీసులు లాఠీలను పక్కన పెట్టి కెమెరాలతో వెంటపడుతున్నారు. కెమెరాతో క్లిక్‌మనిపిస్తూ వాహనదారులను బెంబేలిత్తిస్తున్నారు. నిజామాబాద్‌లో ఐదు నెలల క్రితం అమల్లోకి తెచ్చిన కొత్త విధానంతో వాహనదారులు వణికిపోతున్నారు. లాఠీలు పక్కన పెట్టి కెమెరాలతో డ్యూటీలు చేస్తున్నారు నిజామాబాద్‌ పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడంలో సాంకేతికను వినియోగిస్తున్నారు. ఈ-చలానాలు అమల్లోకి తెచ్చిన ఐదు నెలల్లోనే రికార్డు స్ధాయిలో జరిమానాలు విధించి సరికొత్త రికార్డు సృష్టించారు. 41వేల మంది వాహనదారులపై కేసులు నమోదుచేసి కోటీ 70లక్షల రూపాయలను వసూలు చేశారు.

గతంలో ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడితే వందో రెండొందలో కట్టి బయటపడే వాహనదారులు ఇప్పుడు ఈ-చలానాలతో వెయ్యి నుంచి 2వేల వరకు జరిమానా చెల్లించాల్సిన పరిస్ధితి నెలకొంది. అయితే టార్గెట్ల కోసం ట్రాఫిక్‌ పోలీసులు ఇష్టమొచ్చినట్లు ఫొటోలు తీసి జరిమానాలు వసూలు చేస్తున్నారని వాహనదారులు మండిపడుతున్నారు. పార్కింగ్ ప్లేసులు చూపించకుండా జరిమానాలు వసూలు చేయడం సరైంది కాదంటున్నారు. కేవలం 5 నెలల్లోనే 41వేల 467 ఎంవీ యాక్టు కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించిన నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు రానున్న రోజుల్లో మరింత దూకుడుగా వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే వాహనదారుల్లో మార్పు తీసుకురావటంతోపాటు ట్రాఫిక్‌ నిబంధనలు కాపాడాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ-చలానా విధానాన్ని అమలు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories