Top
logo

సర్వం శివోహం : కీసరలో బ్రహ్మోత్సవాలు

సర్వం శివోహం : కీసరలో బ్రహ్మోత్సవాలు
X
Highlights

ఓం నమ శివాయ శంబో శివ శంకరా ఇప్పుడు ఎక్కడా చూసినా ఈ నామ స్మరణ మారు మ్రోగుతోంది. మ‌హా శివరాత్రి పర్విదినం...

ఓం నమ శివాయ శంబో శివ శంకరా ఇప్పుడు ఎక్కడా చూసినా ఈ నామ స్మరణ మారు మ్రోగుతోంది. మ‌హా శివరాత్రి పర్విదినం రావడంతో ఇప్పుడు ఆలయాల్లో శివ నామ స్మరణ మార్మోగుతోంది. హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండే కీసరగుట్ట ఆలయం కూడా ముస్తాబైంది. శివునికి ప్రీతి పాత్రమైన సోమవారం వస్తున్న శివరాత్రికి కీసర గుట్ట పై నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలపై ఓ స్పెషల్.

మహా శివరాత్రి వస్తుందంటే చాలు హైదరాబాద్ నగరవాసులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల వారు కీసర గుట్ట బాట పడుతారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న శైవక్షేత్రాల్లో ఒకటిగా కేసరిగిరి ప్రసిద్ది చెందింది. అత్యంత ప్రసిద్ది చెందిన కీసరలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెల 2 వ తేది నుంచి 7వ తేది వరకు ఆరు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రధానంగా ఈ నెల 4 వ తేదీ జరుగనున్న మహాశివరాత్రి వేడుకలకు కేసరిగిరి ఆలయం ముస్తాబు చేశారు. శివరాత్రి సోమవారం రానుండడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ పూజారి చెబుతున్నారు.

హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న కీసర శ్రీరామలింగేశ్వర స్వామి దర్శనానికి ఈ దఫా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అదికారులు అంచనా వేస్తున్నారు. శివరాత్రి రోజు దాదాపు 10 నుంచి 12 లక్షల మంది భక్తులు వస్తారని అదికారులు చెబుతున్నారు. మ‌హా శివరాత్రి వేడుకలతో పాటు ఆరు రోజులు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి హైదరాబాద్ నుంచే కాకుండా వివిద రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగిన ఏర్పాట్లు చేూస్తున్నారు అధికారులు.

Next Story