గిరిజన గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి

గిరిజన గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి
x
Highlights

పాఠశాలలు మొదలై.. పట్టుమని పదిరోజులు కూడా కాలేదు.. గిరిజన గురుకుల పాఠశాలలో ఉద్యోగుల నిర్లక్షానికి విద్యార్థిని బలైంది. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం...

పాఠశాలలు మొదలై.. పట్టుమని పదిరోజులు కూడా కాలేదు.. గిరిజన గురుకుల పాఠశాలలో ఉద్యోగుల నిర్లక్షానికి విద్యార్థిని బలైంది. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం పడమటితండా గ్రామానికి చెందిన రవికుమార్‌, వినోద దంపతుల కూతురు నేహా.. గిరిజన గురుకులంలో ఎనిమిదోతరగతి చదువుతోంది. అయితే గత రాత్రి నుంచి వివపరీతంగా వాంతులు అవుతుండగా వార్డెన్‌ పట్టించుకోలేదు. దీంతో విద్యార్థినిని ఈరోజు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. ఆశ్రమ సిబ్బంది నిర్లక్షంతోనే తమ కుమార్తె చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కనీసం తమకు తమ కూతురి ఆరోగ్యం బాగాలేదన్న సమాచారం కూడా ఇవ్వలేదని, నేహా మరణించాక... మార్చురీలో బాడీ చూపించారని ఆగ్రహించారు. విద్యార్థిని మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories