మహిళను గౌరవిద్దాం, ఆమెకు ఏ కష్టం రాకుండా కాపాడుకుందాం..

మహిళను గౌరవిద్దాం, ఆమెకు ఏ కష్టం రాకుండా కాపాడుకుందాం..
x
Highlights

మహిళ.. ఈ మాటలోనే మహోన్నతం అనే మాట దాగుంది. మహిళ అంటే మానవతామూర్తి.. మహోన్నత భావాలున్న శక్తి.. ప్రపంచ గమనానికి మూలమైన కుటుంబ వ్యవస్థకు ఆది మూలం మహిళ....

మహిళ.. ఈ మాటలోనే మహోన్నతం అనే మాట దాగుంది. మహిళ అంటే మానవతామూర్తి.. మహోన్నత భావాలున్న శక్తి.. ప్రపంచ గమనానికి మూలమైన కుటుంబ వ్యవస్థకు ఆది మూలం మహిళ. ఆమె అన్నిట్లో అత్యున్నతమే అయినా.. సమానత్వంలో అత్యల్పం. ఆ ఆవేదన నుంచి పుట్టిందే ఈ మహిళా దినోత్సవం. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సందర్బంగా సమస్త మహిళామణులకు శుభాకాంక్షలు. మహిళా దినొత్సవం ఒక పుట్టుకకూ, ఒక అస్తిత్వానికి, ఒక పునరుజ్జీవానికీ, ఒక కొనసాగింపునకూ గౌరవం ఇచ్చే రోజు. నిజానికి మన భారతీయ పద్దతిలో ఎక్కువమందికి అర్థమయ్యేలా చెప్పాలీ అంటే ఇదో విజయ దశమి, మనిషి మనుగడ కోసం స్త్రీ అవసరాన్ని గుర్తించి స్మరించుకునే రోజు… భూమి మీద మనిషి అంటూ మిగలటానికి పురుషుని తో సమానంగా స్త్రీ అవసరం అన్న నిజాన్ని గుర్తు చేసే రోజు.

'ఆమె'... తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది... భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ... సర్వం త్యాగం చేస్తుంది. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఈరోజే.. 'యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా' - స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని అన్నారు. అన్నం కలిపి గోరు ముద్ద పెట్టేప్పుడు తన బిడ్డ మీద ఉన్న ప్రేమ కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దలు తింటుంటే... బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ, ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అదీ.. అమ్మ ప్రేమంటే. స్త్రీమూర్తి గొప్పతనమంటే. అమ్మ, సోదరి, భార్య, అమ్మమ్మగా.. ఇంకా ఎన్నో రూపాల్లో ప్రేమను పంచుతుంది. అటువంటి మహిళను గౌరవిద్దాం, ఆమెకు ఏ కష్టం రాకుండా కాపాడుకుందాం..

Show Full Article
Print Article
Next Story
More Stories