Top
logo

ఆ పాము ఖరీదు రూ.1.6 కోట్లు!

ఆ పాము ఖరీదు రూ.1.6 కోట్లు!
X
Highlights

జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో నగరంలో రూ.1.6 కోట్ల విలువైన అరుదైన పామును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొకారో ...

జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో నగరంలో రూ.1.6 కోట్ల విలువైన అరుదైన పామును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొకారో నగరానికి చెందిన సునీల్ పాశ్వాన్, మహ్మద్ షహబుద్దీన్ లు అరుదైన పామును చైనాకు రవాణ చేసేందుకు సిద్ధమవగా పోలీసులు పట్టుకున్నారు. అరుదైన పామును స్వాధీనం చేసుకొని, నిందితులిద్దరిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలో కనిపించే ఈ అరుదైన పాములకు అంతర్జాతీయ మార్కెట్ లో ముఖ్యంగా చైనా దేశంలో మంచి డిమాండ్ ఉంది. నేపాల్ దేశం మీదుగా అంతర్జాతీయ ముఠా అరుదైన పాములను స్మగ్లింగ్ చేస్తోందని అటవీశాఖ అధికారి సురేంద్ర భగత్ చెప్పారు. బొకారో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story