మరోసారి ట్రంప్, కిమ్ భేటీ

Highlights
ఉత్తరకొరియా అణు నిరాయుధీకరణ, క్షిపణి అభివృద్ధిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌లు...
Raj20 Jan 2019 2:20 AM GMT
ఉత్తరకొరియా అణు నిరాయుధీకరణ, క్షిపణి అభివృద్ధిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌లు మరోసారి చర్చలు జరపనున్నారు. ఇందుకోసం రెండు దేశాధినేతలు ఫిబ్రవరిలో మరోసారి సమావేశమవుతారని వైట్‌హౌస్ తెలిపింది. అయితే సమావేశం జరిగే వేదికను మాత్రం ప్రకటించలేదు. గతేడాది జూన్ 12న సింగపూర్‌లోని ఓ హోటల్‌లో ట్రంప్, కిమ్ తొలిసారి భేటీ అయ్యారు. ఆ భేటీలో అణు నిరాయుధీకరణ, క్షిపణి అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. చర్చల అనంతరం ఇరుదేశాధినేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. కాగా, ఉత్తరకొరియా అణ్వస్త్రాలను త్యజించేవరకూ ఆంక్షలను కొనసాగిస్తామని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ తెలిపారు. మరోవైపు, అమెరికా దక్షిణ సరిహద్దులో నెలకొన్న మానవతా సంక్షోభంతో పాటు షట్‌డౌన్‌పై కీలక ప్రకటన చేస్తానని ట్రంప్ ట్విట్టర్‌లో వెల్లడించారు.
లైవ్ టీవి
దిశ నిందితుల ఎన్ కౌంటర్..రోజంతా ఉచితంగా టీ
7 Dec 2019 9:23 AM GMT'శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేయాలి'
7 Dec 2019 9:20 AM GMTఉన్నావ్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంక
7 Dec 2019 9:08 AM GMTప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన జె.సి యాదిరెడ్డి
7 Dec 2019 9:03 AM GMTఢిల్లీలోని సఫ్తర్‌జంగ్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. ఆస్పత్రి...
7 Dec 2019 8:30 AM GMT