అర్ధాంతరంగా ముగిసిన ట్రంప్, కిమ్ సమావేశం..

అర్ధాంతరంగా ముగిసిన ట్రంప్, కిమ్ సమావేశం..
x
Highlights

అద్భుతాలేవీ జరగకుండా ట్రంప్, కిమ్ ల సమావేశం అర్ధంతరంగా ముగిసింది. వీరి సమావేశం ఈసారి వియత్నాంలోని హనోయ్‌లో జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర...

అద్భుతాలేవీ జరగకుండా ట్రంప్, కిమ్ ల సమావేశం అర్ధంతరంగా ముగిసింది. వీరి సమావేశం ఈసారి వియత్నాంలోని హనోయ్‌లో జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ మధ్య జరిగిన మలి విడత సమావేశం అర్ధంతరంగా ముగిసినట్టుగా అధికారులు దృవీకరించారు. ఇందులో ఎలాంటి ఒప్పందం జరగలేదని వెల్లడించారు. కాగా గతంలో సింగపూర్‌లో జరిగిన ఇరువురి మధ్య భేటీ సత్ఫలితాలను ఇవ్వడంతో మలి విడత సమావేశంపై ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాయి.

అయితే ట్రంప్‌, కిమ్‌ ఎలాంటి సంయుక్త ప్రకటనను విడుదల చేయలేదు. దీంతో ఇద్దరు నేతల మధ్య ఆశించిన రీతితో చర్చలు జరగలేదని తెలుస్తోంది. ఇదిఅలావుంటే గతంలో ఇరువురి మధ్య చర్చలు జరిగినప్పుడు అణు, ఖండాంతర క్షిపణి పరీక్షలు జరుపబోమని కిమ్ హామీ ఇచ్చారు. అప్పట్లో ఇది గొప్ప విజయంగా భావించాం. కిమ్‌కు, నాకు మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ భవిష్యత్‌లో ఇరువురి మధ్య మూడో సమావేశం జరుగుతుందని స్పష్టంగా చెప్పలేను అని ట్రంప్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories