యోగా మంత్రం జపిస్తోన్న ప్రపంచం

పిల్లల నుంచి వృద్ధుల వరకు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు. ఇండియా నుంచి ప్రపంచం నలుమూలలకు. అంతా ఒకటే మంత్రం....
పిల్లల నుంచి వృద్ధుల వరకు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు. ఇండియా నుంచి ప్రపంచం నలుమూలలకు. అంతా ఒకటే మంత్రం. యోగా. మానసిక సమస్యలకు పరిష్కార మార్గం యోగా. టెక్నాలజీలేవీ పుట్టకముందే పుట్టిన యోగా ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి నిర్వహిస్తోందే అంతర్జాతీయ యోగా దినోత్సవం. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచమంతా యోగాసనాలు వేస్తున్నారు. యోగా ఎప్పటి నుంచో ఉంది. ప్రపంచంలో కూడా చాలా మంది.. చాలా ఏళ్లుగా యోగాని సాధన చేస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనంత ఉత్సుకత ఇప్పుడు కనిపిస్తోంది. ప్రత్యేకంగా యోగాకి ఓ రోజు కేటాయించడం ఐక్యరాజ్యసమితి దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించడంతో యోగా డేకు ప్రత్యేక ఏర్పడింది.ఒకప్పుడు భారత్ నుంచి అడుగులు ప్రారంభించి ఇప్పుడు దశదిశలా వ్యాపించిన యోగాని మళ్లీ ఇండియానే బ్రాండింగ్ చేయడం ఈ యోగాడే స్పెషల్. మారుతున్న పరిస్థితులకు తగినట్టు మానసిక, శారీరక ఒత్తిడిన జయించలేక సతమతమవుతోంది ప్రపంచం. ఇలాంటి సమయంలో ప్రపంచాన్ని రక్షించగల శక్తి యోగాకి మాత్రమే ఉంది.
యోగాని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. దాన్ని UNO కూడా అత్యంత వేగంగా ఆమోదించింది. సంవత్సరంలోని 365 రోజుల్లో అత్యంత ఎక్కువ పగటి సమయం ఉండే జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని తీర్మానించింది. దాని ప్రకారం ప్రతీ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. యోగా డేకు ముందు నుంచి దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో యోగాపై అవగాహన పెంచి దీన్ని ప్రతీ ఒక్కరూ ఆచరించడానికి ప్రయత్నం చేస్తోంది మోడీ సర్కార్.
లైవ్ టీవి
Ind vs W I 2nd T20 ; తొలి వికెట్ కోల్పోయిన భారత్
8 Dec 2019 1:42 PM GMTడబుల్ సెంచరీ నాటౌట్
8 Dec 2019 1:38 PM GMTఆ రెండు ప్లాన్లు మళ్లీ అందుబాటులోకి..
8 Dec 2019 1:09 PM GMTInd vs WI 2nd T20 : ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు విరే
8 Dec 2019 1:03 PM GMTInd vs W I 2nd T20 : కాసేపట్లో రెండో టీ20.. టాస్ గెలిచిన...
8 Dec 2019 12:54 PM GMT