నెటిజన్ల హృదయాల్ని కదిలిస్తున్న మరణం

నెటిజన్ల హృదయాల్ని కదిలిస్తున్న మరణం
x
Highlights

అమెరికాలో ఆశ్రయం పొందేందుకు విఫలయత్నం చేసిన ఓ వ్యక్తి తన చిన్నారి కుమార్తెతో సహా నదిలో ఈదుతూ ప్రాణాలు కోల్పోయాడు. అమెరికా, మెక్సికో సరిహద్దు వద్ద రియో...

అమెరికాలో ఆశ్రయం పొందేందుకు విఫలయత్నం చేసిన ఓ వ్యక్తి తన చిన్నారి కుమార్తెతో సహా నదిలో ఈదుతూ ప్రాణాలు కోల్పోయాడు. అమెరికా, మెక్సికో సరిహద్దు వద్ద రియో గ్రాండే నదీతీరంలో విగతజీవులుగా పడి ఉన్న వీరి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో కంటతడి పెట్టిస్తోంది. సురక్షిత తీరాలకు తరలి వెళ్లేందుకు శరణార్థులు ఎలా ప్రాణాలకు తెగిస్తున్నారో ఈ దృశ్యం కళ్లకు కడుతోందని నెటిజన్లు చెబుతున్నారు.

తండ్రీ కుమార్తెలిద్దరూ బోర్లా పడి ఉండగా, తన తండ్రి టీషర్టులో దూరిన ఆ చిన్నారి ఆయన మెడపై చేయివేసి ఉంది. అమెరికా 'ఐలాన్ కుర్ది' ఘటనగా చెబుతున్న ఈ దృశ్యం చూపరుల హృదయాలను పిండేస్తోంది. ఓ మెక్సికో వార్తాపత్రిక కథనం ప్రకారం.. ఎల్ సల్వడార్‌కి చెందిన ఆస్కార్ అల్బెర్టో మార్టనేజ్ రమిరేజ్‌కు అమెరికా అధికారులను కలిసి ఆశ్రయం కోరడం ఇష్టం లేదు. దీంతో ఆదివారమంతా తన కుమార్తె వాలెరియతో కలిసి నది దుకుంటూ వచ్చాడు. నదీ తీరానికి తన కుమార్తెను చేర్చి.. భార్యను తీసుకొచ్చేందుకు వెనక్కి తిరిగాడు. అయితే ఇంతలో వాలెరియా కూడా అతడితో పాటు వచ్చేందుకు ప్రయత్నిస్తూ దూకేసింది. మార్టనెజ్ తన కుమార్తెను పట్టుకున్నప్పటికీ నీటి ప్రవాహం ధాటికి ఇద్దరూ నదిలో కొట్టుకుపోయారు.

మార్టనెజ్ తమను వదిలి వెళ్లకుండా ఉంటే బాగుండేదని అతడి తల్లి రోసా రమిరెజ్ కన్నీరుమున్నీరయ్యారు. వాస్తవానికి అతడు వెళ్లడం తమకు ఇష్టం లేదనీ.. అయితే గృహ నిర్మాణానికి డబ్బు అవసరం ఉండడంతో కొన్ని నెలలు అక్కడికెళ్లి రావాలని అతడు అనుకున్నాడని ఆమె పేర్కొన్నారు. కాగా సోనోరన్ ఎడారి నుంచి రియో గ్రాండే వరకు 2 వేల మైళ్ల పొడవునా ఉన్న అమెరికా-మెక్సికో సరిహద్దులో చాలా కాలంగా ఇదే పరిస్థితి నెలకొంది. గత ఒక్క ఏడాదిలోనే 283 మంది శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శరణార్థుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories