నరమేథం!

నరమేథం!
x
Highlights

నైజీరియాలో ఉగ్రభూతం మళ్లీ ఒళ్ళువిరుచుకుంది. ఫుట్ బాల మ్యాచ్ చూస్తున్న వారిపై తన పంజా విసిరింది. బోకోహరాం ఉగ్రవాదులు ఫుట్ బాల్ చూస్తున్న వారిపై...

నైజీరియాలో ఉగ్రభూతం మళ్లీ ఒళ్ళువిరుచుకుంది. ఫుట్ బాల మ్యాచ్ చూస్తున్న వారిపై తన పంజా విసిరింది. బోకోహరాం ఉగ్రవాదులు ఫుట్ బాల్ చూస్తున్న వారిపై ఆత్మాహుతి దాడి చేశాయి. ఈ దాడిలో 30 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది గాయాలపాలయ్యారు. నైజీరియాలోని బోర్నో రాష్ట్ర ముఖ్యనగరం మైదుగురి సమీపంలో ఈ దాడి జరిగింది. కొండుగ అనే ప్రాంతంలో కొందరు ఫుట్ బాల్ అభిమానులు వీడియో థియేటర్ లో లైవ్ మ్యాచ్ చూస్తుండగా, ఓ వ్యక్తి అక్కడి వీడియో ఆపరేటర్ తో గొడవపెట్టుకుని తనను తాను పేల్చుకున్నాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు మ్యాచ్ ను వీక్షిస్తున్న ప్రజల మధ్యకు వెళ్లి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మొదట 9 మంది ఘటనస్థలంలోనే ప్రాణాలు విడువగా, అంబులెన్స్ లు రావడంతో ఆలస్యం కావడంతో మరో 21 మంది తుదిశ్వాస విడిచారు. ఇది బోకోహరాం ఉగ్రవాదుల పనేనని నైజీరియా ప్రభుత్వం పేర్కొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories