ఆస్ట్రేలియా ప్రధానిగా మళ్లీ స్కాట్ మోరిసన్

ఆస్ట్రేలియా ప్రధానిగా మళ్లీ స్కాట్ మోరిసన్
x
Highlights

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తూ తిరిగి విజయం సాధించారు. ఆయన ఓడిపోతారంటూ ఎగ్జిట్ పోల్స్ చేసిన...

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తూ తిరిగి విజయం సాధించారు. ఆయన ఓడిపోతారంటూ ఎగ్జిట్ పోల్స్ చేసిన అంచనాలను తలకిందులు చేస్తూ మోరిసన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ సంకీర్ణం అనూహ్య ఫలితాలను సాధించింది. ఇది తమ జీవిత కలల సాఫల్యానికి నిరంతరం కష్టపడుతున్న ప్రతి ఒక్క ఆస్ట్రేలియన్‌ విజయమని సిడ్నీలో జరిగిన విక్టరీ పార్టీలో మోరిసన్ కృతజ్ఞతలు తెలిపారు. దేశవాసులకు తాము చేయాల్సింది చాలా ఉందని, వారి అభ్యున్నత కోసం తాము పునరంకితమవుతామని, మా ప్రభుత్వం వారి కలలు సాకారం చేస్తుందని మోరిసన్ ప్రకటించారు.

ప్రతిపక్ష లేబర్ పార్టీ గెలుపు ఖాయమంటూ కొద్దికాలంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేసినప్పటికీ మెజారిటీ సీట్లను కన్జర్వేటివ్ సంకీర్ణం గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ప్రధానిని ఎన్నుకునేందుకు గత శనివారం జరిగిన ఎన్నికల్లో 1.6 కోట్ల మంది ఓటేశారు. మొత్తం 151 సీట్లలో అధికార పార్టీ ఇంతవరకూ 74 స్థానాలు కైవసం చేసుకోవడంతో మోరిసన్ మళ్లీ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమైంది. లేబర్ పార్టీ 65 స్థానాలు గెలుచుకుంది. కాగా, లేబర్ పార్టీ నేత బిల్ షార్టెన్ ఈ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ తాను పార్టీ నాయకత్వం నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories