కుక్క అనుకోని కాపాడితే అది..

కుక్క అనుకోని కాపాడితే అది..
x
Highlights

కుక్క, నక్క, తోడేలు.. ఇవి చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. ఈ మూడింటికి రూపంలో పెద్ద తేడా ఉండదు.. కానీ కుక్క మనుషుల మధ్య తిరుగుతే.. నక్క, తోడేలు మాత్రం...

కుక్క, నక్క, తోడేలు.. ఇవి చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. ఈ మూడింటికి రూపంలో పెద్ద తేడా ఉండదు.. కానీ కుక్క మనుషుల మధ్య తిరుగుతే.. నక్క, తోడేలు మాత్రం అడవిలో క్రూర జంతువుల మధ్య జీవిస్తాయి.. ఈ మూడు జంతువులు మాంసాహారం సేవిస్తాయి. ఒక్కోసారి కుక్కను చూసి నక్క అని.. నక్కను చూసి తోడేలు అనుకుంటాం ఇలాగే కొంతమంది కూలీలు కన్ఫ్యూజ్ అయ్యారు. కుక్క అనుకుని తోడేలును కాపాడారు.. ఈ సంఘటన యూరప్‌లోని ఎస్టోనియాలోని పర్ను నదిలో చోటుచేసుకుంది. అయితే ఆ నది విపరీతమైన మంచు కారణంగా గడ్డకట్టుకుపోయింది.

దాంతో ఆ నదిలో చిక్కుకుపోయిన ఓ తోడేలు ఇర్రుక్కుపోయింది. దీన్ని అక్కడ పనిచేసి కూలీలు చూశారు. దాన్ని కుక్కగా భావించి మంచులో నుండి బయటకు తీశారు. ఆ తర్వాత తెలిసింది అది కుక్క కాదు తోడేలు అని. అంతే అది తోడేలు అని తెలిసి భయంతో అరకిలోమీటరు దూరం పారిపోయారు. అయితే అదృష్టవశాత్తు అది చలికి బాగా వణికి క్షీణించి పోవడంతో వాళ్లను ఏం చేయలేదు. దీంతో అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. వారు తోడేలును పట్టుకుని చికిత్స చేశారు. కోలుకున్నాక ఆ తోడేలుకు జీపీఎస్ తొడిగి సమీపంలోని అడవిలో వదిలారు.


Show Full Article
Print Article
Next Story
More Stories